మెగా హీరో వరుణ్ తేజ్ కు ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో క్రేజ్ ఉంది. తొలిప్రేమ - ఫిదా - ఎఫ్ 2 లాంటి సినిమాలతో వరుణ్ నటనాపరంగా అదరగొట్టేసాడు. ఈ సినిమాలలో వరుణ్ తేజ్ పెర్ఫామెన్స్ కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అయితే వరుణ్ గత కొద్ది రోజులుగా వరుసగా డిజాస్టర్ల మీద డిజాస్టర్లు ఇస్తున్నాడు. సరైన కథ .. సరైన దర్శకులను ఎంపిక చేసుకోకుండా కేవలం రెమ్యునరేషన్ చూసుకుంటూ ఇష్టం వచ్చినట్టు సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. వరుణ్ తేజ్ గత నాలుగు సినిమాలు అతిపెద్ద డిజాస్టర్లు అయ్యాయి. గత ఏడాదికి గని ... ఈ ఏడాది గాండీవ ధారి అర్జున - ఆపరేషన్ వాలెంటైన్ ... తాజాగా వచ్చిన మట్కా సినిమాలు పెద్ద డిజాస్టర్లు అయ్యాయి. మట్కా సినిమా అయితే 40 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కి కేవలం రెండు కోట్ల రూపాయల వసూళ్లు మాత్రమే సొంతం చేసుకుంది. అసలు ఈ సినిమా రిజల్ట్ చూసిన తెలుగు సినిమా ట్రేడ్ వర్గాలు వరుణ్ తేజ్ సినిమాలు కొనాలి అంటేనే భయపడి పోతున్నారు.
మట్కా సినిమా ఫలితం వరుణ్ తేజ్ తర్వాత సినిమాలపై కూడా గట్టిగా ప్రభావం చూపిందని తెలుస్తోంది. వరుణ్ తేజ్ - మేర్లపాక గాంధీ కాంబినేషన్లో ఒక సినిమా ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు ఆదిలో నే ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలుస్తోంది. ఈ సినిమాకు భారీ స్థాయిలో ఖర్చు పెట్టేందుకు నిర్మాతలు సాహసం చేయడం లేదని తెలుస్తోంది. సినిమా బడ్జెట్ విషయంలో భారీగా కోతలు పెట్టేస్తున్నారట. ఏది ఏమైనా వరుణ్ రెమ్యూనరేషన్ అన్నది చూసుకోకుండా సరైన కథ సరైన దర్శకులు ఎంపిక చేసుకుని పక్క ప్లానింగ్ తో సినిమాలు చేసుకుంటూ వెళితే తప్ప కెరీర్ ముందుకు వెళ్లే పరిస్థితి అయితే లేదు. మరి వరుణ్ తేజ్ ఏం చేస్తాడో ? చూడాల్సి ఉంది.