ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా రెండు రోజుల్లో థియేటర్ లోకి రానుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాపై ఏ స్థాయిలో ? అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అసలు ఈ సినిమాకు ఎంత ఖర్చయింది ? ఎవరికి ఎంత రెమ్యునరేషన్ నిర్మాతలకు ఎంత మిగిలింది ? ఇలాంటి అనేక ప్రశ్నలు ఉండనే ఉన్నాయి. దీనిమీద చాలా లెక్కలు ... చాలా అంచనాలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం పుష్ప 2 లెక్కలు ఇలా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు అన్ని కలిపి అంటే నిర్మాణ వ్యయం వడ్డీలు కలి పి రు. 475 కోట్లు ఖర్చు అయింది. ఇది హీరో రెమ్యూనరేషన్ కాకుండా ఆయన ఖర్చు. హీరోకి మొదట్లో టోటల్ బిజినెస్ మీద 27% అన్నది ఒక మాట .. కానీ చివరకు ఫైనల్ చేసింది 24 శాతం అని తెలుస్తోంది.
అంటే బన్నీకి ఈ సినిమాకు వచ్చిన రెమ్యునరేషన్ రు. 240 కోట్లు .. అంటే 475 కోట్లకు ఈ రు. 240 కోట్లు యాడ్ చేయాలి. అంటే పుష్ప 2 సినిమాకు అయిన టోటల్ ఖర్చు రు. 715 కోట్లు. టోటల్ మార్కెటింగ్ అమౌంట్ లో మిగిలింది 285 కోట్లు. ఇందులో సగం సుకుమార్ రైటింగ్ సంస్థకు ఇవ్వాల్సింది .. అంటే దగ్గర దగ్గర 140 కోట్లు. ఈ 140 కోట్లలో 10 % బన్నీ వ్యవహారాలు చూసే వ్యక్తికి ఇవ్వాలి .. అంటే నిర్మాతలకు ఇక నికరంగా మిగిలింది. సుమారు రు. 125 కోట్లు. సినిమాను దాదాపు మూడు వంతులకు పైగా ఏరియాలలో ఓన్ గా రిలీజ్ చేసుకున్నారు. అందువల్ల సినిమా సూపర్ హిట్ అయ్యి ఓవర్ ఫ్లోస్ వస్తే నిర్మాతలకు మంచి లాభం. లేదు సినిమాకు అనుకున్నట్టు లాభాలు రాకపోతే ... తీసుకున్న అడ్వాన్సులు వెనక్కు ఇవ్వాల్సి వచ్చినా అది నిర్మాతల లాభం మీద ప్రభావం చూపిస్తుంది. అప్పుడు హీరో - దర్శకుడు తమ వాటా తగ్గించుకుంటారా లేదా అన్నది చూడాలి.