ఒక సినిమా టిక్కెట్ 3 వేల రూపాయిలా ... అలాగే ఆంధ్రప్రదేశ్లో వెయ్యి రూపాయలా .. తెలంగాణలో కాస్త అటు ఇటుగా రు. 1200 జీరో కు పైనే. నీకు ఇష్టమైతే మా సినిమా చూడు .. కష్టమైతే మానేయ్ అన్నట్టుగా ఉంది టాలీవుడ్ ట్రెండ్. ఇక్కడ కాంబినేషన్లు కీలకం. ఆ కాంబినేషన్ సినిమాకు కంటెంట్ అంతకన్నా కీలకం .. కంటెంట్ బాగుంది అనే టాక్ వస్తే టికెట్ రేటు ఎంత ? అన్నది నిర్మాత ఇష్టం. అంత రేటు పెట్టి టిక్కెట్ కొని చూడటం .. చూడకపోవటం ప్రేక్షకుడి ఇష్టం. అభిమాన హీరో ఏ షో ముందు అయితే ఆ షో చూసేయలన్న అభిమానులకు భయంకరమైన కోరిక ఉంటుంది. ఆ కోరికనే ఇప్పుడు నిర్మాతలు .. హీరోలు క్యాష్ చేసుకుంటున్నారు. హీరోలకు వందల కోట్ల రెమ్యూనరేషన్ అలాగే దర్శకులకు అతి భారీ రెమ్యూనరేషన్ ఇవ్వటం వల్ల ఖర్చు 1000 కోట్లకు చేరిపోతుంది. దాని వల్ల అందుకు అంతా వెనక్కు రాబట్టుకోవాలంటే జనాల్ని ఎక్స్‌ప్లెయిన్ చేయడం వల్ల మరో దారి లేదు.
ఒకప్పుడు బెనిఫిట్ షోలు అనే మాయాజాలం జరిగేది. ఈ బిజినెస్తో అవగాహన ఉన్న కొందరు బయ్యర్ దగ్గరికి వెళ్లి ఒక షో కొనుక్కునేవారు. ఆ పైన పోలీస్ శాఖకు వివిధ అధికారులకు ఎంతో కొంత రేటు పెట్టి అమ్మేవారు. పైకి ఏదో ఒక సంస్థ కు డొనేషన్ అనే కలరింగ్ ఇచ్చేవారు. షో వేసుకున్న వారు ఎంతో కొంత లాభం మిగిల్చుకునేవారు. ఇలా సాగుతుంటే ఇటీవల రెండు మూడు పెద్ద సినిమాలకు ఒక చిన్న ట్రిక్ వేశారు. ఎవరికీ ఏ షోలు ఇవ్వకుండా తామే మొత్తం టికెట్లో ఆఫీసుకు తెప్పించుకుని ఎవరికైనా టికెట్ కావాలి అంటే 1000 రూపాయలకు అమ్మటం మొదలుపెట్టారు. కొన్నాళ్ల నుంచి ఇది అధికారికంగా 1000 రూపాయలు మరియు జీఎస్టీ కలుపుకుని దగ్గర దగ్గర 1200 టిక్కెట్ రేటు అవుతోంది. దేవరకు తెలంగాణలో 1200 టిక్కెట్ తేవాలని ప్రయత్నాలు జరిగాయి.. ఎందుకో కుదరలేదు.
ఇప్పుడు పుష్ప 2 కు పాజిబుల్ అయింది. అయితే ఇక్కడే మరో ట్విస్ట్ కూడా ఉంది. పుష్ప 2 సినిమాకు బన్నీకి 275 కోట్లు రెమ్యునరేషన్ ఇచ్చారు. అలా కాకుండా బన్నీ ఓ 50 కోట్లు తగ్గించుకుని ఉంటే .. ఇంత రేట్లు అనవసరం. అప్పుడు నైజంలో 100 కోట్లకు కాకుండా 70 కోట్లు అమ్మ వచ్చు. ఇప్పుడు టికెట్ రేట్లు ఇంత అవసరం లేదు. కానీ ఎవరు రెమ్యునరేషన్ ఎవరు తగ్గించుకుంటారు ? జనం ఇస్తున్నప్పుడు నిర్మాతలకు ఏం నొప్పి .. హీరోకి ఇవ్వటానికి .. అందువల్ల అంతిమంగా నష్టపోయేది ప్రేక్షకుడే. ట్రాక్షకుడికి ఇప్పుడు ఆప్షన్ ఉంది .. థియేటర్లో చూడాలా ఓ టి టి లో చూడాలా అన్నది ?ఆ విచక్షణ ప్రేక్షకుడు వాడుకుంటాడా ? వాడుకోడా అన్నది అతడి ఇష్టం.