- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .

టాలీవుడ్ లో మరో ఏడాది కాలగర్భంలో కలిసిపోవడానికి ఒక నెల మాత్రమే మిగిలి ఉంది. 2024 చాలా స్పీడ్ గా అయిపోయింది. అనుకున్న స్థాయిలో హిట్ సినిమాలు రాలేదు. నవంబర్ నెల ముగిసింది. డిసెంబర్ వచ్చేసింది .. డిసెంబర్ అయిపోతే 2025 వచ్చేస్తుంది. సంక్రాంతి సినిమాలు హడావుడి ఎలాగూ ఉంటుంది. ఇదిలా ఉంటే నవంబర్ నెలలో అనుకున్న స్థాయిలో హిట్ సినిమాలు రాలేదు .. అన్ని డిజాస్టర్లు అయ్యాయి. ఇక డిసెంబర్ నెల అంటే రష్మిక అలియాస్ రష్మికకు చాలా ఇష్టం .. ఆమెకు డిసెంబర్ అంటే ఓ పెద్ద సెంటిమెంట్. ఆమె హీరోయిన్గా పరిచయమైన తొలి సినిమా కిరిక్ పార్టీ. ఆ సినిమా డిసెంబర్లో రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయింది. రష్మిక ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ ను చేసేసింది. ఆ సినిమా ఇక కన్నడలో పునీత్ రాజ్ కుమార్ తో చేసిన అంజనీపుత్ర - గణేష్ తో చేసిన చమక్ అనే సినిమాలు కూడా డిసెంబర్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆమెను నేషనల్ స్టార్ ను చేసిన యానిమల్ - పుష్ప పార్ట్ వన్ సినిమాలు కూడా డిసెంబర్లో వచ్చాయి.


అందుకే డిసెంబర్ నెల అంటే తనకు చాలా సెంటిమెంట్ అంటుంది రష్మిక. బన్నీకి జోడిగా ఆమె నటించిన పుష్ప సినిమా మూడు యేళ్ల‌ క్రితం డిసెంబర్లో రిలీజ్ అయ్యి ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమా దెబ్బకు అప్పటివరకు కేవలం తెలుగు సినిమా హీరోయిన్ గాను లేదా కన్నడ సినిమా హీరోయిన్ గాను ఉన్న రష్మిక నేషనల్ హీరోయిన్ అయిపోయింది. ఆ తర్వాత ఆమెకు ఏకంగా బాలీవుడ్ లో అవకాశం రావడం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ లాంటి పెద్ద హీరో సరసన యానిమల్ సినిమాలో నటించడం .. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో ఆమెకు దేశవ్యాప్తంగా తిరుగులేని అభిమానులు సొంతం అయ్యారు. తాజాగా ఆమె నటించిన పుష్ప 2 సినిమా కూడా డిసెంబర్లోనే రిలీజ్ అవుతుంది. మరో రెండు రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా ఆరు భాషలలో రిలీజ్ అవుతుంది. డిసెంబర్ రష్మికకు సెంటిమెంట్ కాబట్టి ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుందన్న నమ్మకంతో ఆమె ఉంది. మరి భారతీయ సినిమా ప్రేక్షకులు ఏమి చేస్తారు చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: