శ్రీలీలతో పాటు నవీన్ పోలిశెట్టి కూడా ఈ షోకి హాజరై స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. బాలయ్య తనదైన స్టైల్ లో ఇద్దరిని ప్రశ్నిస్తూ ఆటపట్టిస్తూ చాలా సందడి సందడిగా గడిపారు. కొన్ని క్వశ్చహ్న్స్ భలె ఫన్నీగా కూడా అనిపించాయి. అయితే ఎప్పుడు ఈ షోకి ఎవరు గెస్ట్ గా వచ్చిన గెస్ట్లు తక్కువగా మాట్లాడుతారు బాలయ్య ఎక్కువగా మాట్లాడుతారు . ఫర్ దా ఫస్ట్ టైం ఈసారి మాత్రం..బాలయ్య చాలా తక్కువగా మాట్లాడాడు ఈ ఎపిసోడ్లో .
అసలు నవీన్ పోలిశెట్టి బాలయ్యకు మాట్లాడే ఛాన్సే ఇవ్వలేదు. అమత హుషారుగా నవీన్ పోలిశెట్టి తనదైన టైమింగ్ తో రైమింగ్ తో అదరగొట్టేసారు . మరి ముఖ్యంగా " మీరు ఎమ్మెల్యే నేను ఎమ్మెల్యే మీరు మెంబర్ ఆఫ్ లెగిసివ్ అసెంబ్లీ.. నేను మెంబర్ ఆఫ్ లాస్ట్ బెంచ్ అసెంబ్లీ " అంటూ చాలా ఫన్నీగా మాట్లాడారు . అంతేకాదు శ్రీ లీల ఓణి ఫంక్షన్ స్క్రీన్ పై డిస్ ప్లే అవ్వగానే నాటి ఫోటో చూసి వెటకారంగా కౌంటర్ కూడా వేశారు నవీన్ పోలిశెట్టి. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ ప్రోమో బాగా హైలైట్ గా వైరల్ గా మారింది. ఈ ఎపిసోడ్లో బాలయ్య కంటే హుషారుగా షో ని కవర్ చేశాడు నవీన్ పోలిశెట్టి..!