- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .

బాలీవుడ్ స్టార్ జంట అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ విడాకులు తీసుకుంటున్న వార్త చాలా రోజులుగా సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో వైర‌ల్ అవుతోంది. ఎక్క‌డ చూసినా .. ఎప్పుడు చూసినా ఐశ్వ‌ర్య - అభిషేక్ విడాకుల మాటే బాగా వినిపిస్తూనే ఉంది. ఈ వార్తల నేపథ్యంలో అభిషేక్ బచ్చన్ గ‌తంలో రెండు మూడు సార్లు స్పందించాడు. ఈ వార్తలు అవాస్తవం అని ఇప్పటికే క్లారిటీ ఇచ్చినా కూడా అవి ఆగ‌లేదు. తాజాగా అభిషేక్‌ బచ్చన్‌ మగవాళ్ళను ఉద్దేశించి చేసిన కామెంట్లు ఇప్పుడు సోష‌ల్ మీడియాను షేక్ చేస్తూ వైర‌ల్ అవుతున్నాయి.


‘ మీ నటనతో విమర్శకులను ఎలా సైలెంట్‌ చేస్తున్నారు  ? , అది ఎలా సాధ్యమవుతుంది  అని అభిషేక్ బ‌చ్చ‌న్ ను ఓ హోస్ట్ ప్ర‌శ్నించాడు. ఈ ప్ర‌శ్న‌కు అభిషేక్ త‌న‌దైన స్టైల్లో చాలా ఇంట్ర‌స్టింగ్ గా కామెంట్ చేశాడు. నిజం చెప్పాలంటే.. ఇది చాలా మామూలు విషయం. నేను విమర్శలను పెద్దగా పట్టించుకోను అని... ఇక తాను సినిమాలు చేసే క్ర‌మంలో దర్శకులు చెప్పిన విధంగా చేసుకుంటూ వెళ్తాన‌ని తెలిపారు.


ఇక మన పనేదో మనం చేసుకొని సైలెంట్‌గా ఇంటికి వెళ్లిపోవడమే అని తేల్చేశారు. ఇంకా అభిషేక్‌ ఇంకా మాట్లాడుతూ తమ పర్సనల్ లైఫ్ లో పెళ్లైన పురుషులు తమ భార్య మాట వినాల‌ని చెప్పడం విశేషం. అంటే అభిషేక్ పూర్తిగా ఐశ్వ‌ర్య కంట్ర‌ల్లోకి వ‌చ్చేసిన‌ట్టే నా ?  త‌న భార్య పై మ‌నోడికి ఎంత మాత్రం ప్రేమ త‌గ్గ‌లేద‌న్న కామెంట్లు ఇప్పుడు బీ టౌన్ లో బాగా వైర‌ల్ అవుతున్నాయి. ఈ మాట ల‌తో అభిషేక్ బ‌చ్చ‌న్ కు త‌న భార్య ఐశ్వ‌ర్య పై ఉన్న ప్రేమ ఎలాంటి దో మ‌రోసారి క్లీయ‌ర్ గా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: