అయితే ఇండస్ట్రీలోకి సిల్క్ స్మిత అడుగుపెట్టిన తొలి రోజులలో నటిమనులకు మేకప్ వేయడానికి వెళ్లలేదట.. ఆ తర్వాత నటి కావాలని కోరిక మొదలై 1979లో పండిచక్రం అనే ఒక తమిళ చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ఈమె జీవితాన్నే మార్చేసింది ఇమే అసలు పేరు విజయలక్ష్మి.. ఈ చిత్రంలోని పాత్ర కోసం సిల్క్ అనే పేరు బాగా రావడంతో సిల్క్ స్మితగా మార్చుకున్నారు.. తన 17 ఏళ్ల కెరియర్ లోనే సుమారుగా 470కు పైగా చిత్రాలలో నటించింది. సిల్క్ స్మిత ఐటెం సాంగ్ కోసం ఎంతోమంది ప్రేక్షకులు చూడడానికి థియేటర్స్ కు వచ్చే వారట.
సిల్క్ స్మిత హీరోయిన్స్ కంటే ఎక్కువ సాంగ్ కి రెమినరేషన్ అందుకునేదట. ఇలా గ్లామర్ వరల్డ్ లో తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్న సిల్క్ స్మిత జీవితం ఒక్కసారిగా అర్ధాంతరంగా ఆగిపోయింది. హీరోయిన్గా అవుదామని ఇండస్ట్రీలోకి వచ్చి ఐటెం గార్లుగా మిగిలిపోయింది. సిల్క్ స్మిత అవకాశాలు తగ్గడంతో నెమ్మదిగా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి చాలా నష్టపోయిందట. అలాంటి సమయంలోనే వ్యక్తిగతంగా కూడా లవ్ ఫెయిల్యూర్ వల్ల ఆమె చాలా కృంగిపోయిందట.. అలా ఒకవైపు అప్పులు మరొకవైపు ప్రేమ వైఫల్యంతో చాలా మానసిక శోభకు గురై డిప్రెషన్కు వెళ్లి 1996 సెప్టెంబర్ 23న చెన్నైలోని తన ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకొని మరణించిందట సిల్క్ స్మిత.. అయితే ఈమె మరణం పైన ఇప్పటికీ ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఒక స్టార్ హీరోతో ప్రేమలో పడి మోసపోవడం వల్లే మరణించిందని మరి కొంతమంది ఆర్థిక నష్టాల వల్లే ఆత్మహత్య చేసుకుందని ఇలా ఎన్నెన్నో కథలు వినిపిస్తూ ఉంటాయి. కానీ తెలుగు స్మిత మరణం మాత్రం మిస్టరీగానే మిగిలిపోయింది.