కాగా ఈ సాంగ్ లో శ్రీలీల స్టెప్స్ అద్దిరిపోయే రేంజ్ లో ఉన్నాయి అంటూ బాగా హైలైట్ చేశారు . మరి కొంతమంది ఈ పాటను ట్రోలింగ్ కి కూడా గురి చేశారు . కానీ ఎంత నెగిటివ్ కామెంట్స్ దక్కించుకున్న ఈ సాంగ్ మాత్రం ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగిపోతుంది . అమెరికాలో ఉండే తెలుగు వాళ్లు సైతం "దెబ్బలు పడతాయిరో రాజా" అంటూ ఓ రేంజ్ లో ఊపేస్తున్నారు. కాగా ఇదే మూమెంట్లో శ్రీ లీలతో కాంపిటీషన్ గా ఉండే హీరోయిన్ కృతి శెట్టి సైతం ఓ సెన్సేషనల్ డెసీషన్ తీసుకున్నట్లు సోషల్ మీడియాలో బాగా వార్తలు వినిపిస్తున్నాయి .
కోలీవుడ్ ఇండస్ట్రీలో పెద్దగా అవకాశాలు తెచ్చుకుంటున్న కృతి శెట్టి.. టాలీవుడ్ లో మాత్రం పెద్దగా ఆఫర్స్ అందుకోలేక పోతుంది . అయితే ఇదే మూమెంట్లో బడా హీరో సినిమాలో ఐటమ్ సాంగ్ లో కనిపించడానికి ఓకే చేసింది కృతిశెట్టి అన్న వార్తలు బాగా ట్రెండ్ అవుతున్నాయి . అంతేకాదు ఆమె గతంలో నటించిన హీరో సినిమాలోనే ఆమె ప్రజెంట్ ఐటమ్ సాంగ్ చేయడానికి ఒప్పుకుందట . దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే వార్త బాగా ట్రెండ్ అవుతుంది. అయితే చాలామంది జనాలు నాగచైతన్య నెక్స్ట్ సినిమాలో కృతి శెట్టి ఐటెం సాంగ్ లో నటించబోతుంది అంటూ బాగా గెస్ చేస్తున్నారు. దీనిపై అఫీషియల్ ప్రకటన వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు అభిమానులు..!