మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడు కూడా ఏ విషయంలో దూకుడు తనం ప్రవర్తించడు అన్న విషయం అందరికీ తెలిసిందే . దెబ్బ కొడతారు కానీ ఆ దెబ్బ టైం చూసి కొడతాడు . అప్పుడెప్పుడో వజ్రోత్సవంలో జరిగిన గొడవను నిన్న కాకమొన్న జరిగిన ఏ ఎన్ ఆర్ ఈవెంట్ లో బయటపెట్టారు.  అదేవిధంగా టైం చూసి కొడతాడు మెగాస్టార్ చిరంజీవి .. అన్ని విషయాల పై రియాక్ట్ అవుతాడు  అంటున్నారు మెగా ఫాన్స్ . అయితే సోషల్ మీడియాలో మాత్రం ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి పై కూసింత  అసహనంగా కామెంట్స్ వినిపిస్తున్నాయి . ఇండస్ట్రీలో చాలా పెద్దవారు పెద్దదిక్కు అనే విధంగానే అందరు బిహేవ్ చేస్తూ ఉంటారు .


అలాంటి ఆయన సోషల్ మీడియాలో పుష్ప2 పై ఈ రేంజ్ లో ట్రోలింగ్ జరుగుతున్న ఎందుకు మాట్లాడడం లేదు . ఆయన మౌనం  వెనక అర్థం ఏంటి ..? నిజంగానే మీ ఫ్యామిలీకి మీ ఫ్యామిలీకి ఏవైనా గొడవలు ఉండొచ్చు కానీ మీ కారణంగా ఒక సెలబ్రిటీ లైఫ్ పాడైపోకూడదు కదా..? రామ్ చరణ్ విషయం పక్కనపడితే మెగాస్టార్ చిరంజీవి వయసులో పెద్దవారు ..రామ్ చరణ్ - అల్లు అర్జున్ ఇంచుమించు ఒకే తరహాలో ఉండేవారు . ఆ కోపం ఆవేశం అందరికీ ఉంటుంది . కానీ చిరంజీవి ఇలాంటివి ఎన్నెన్నో చూసి పైకి ఎదిగిన వ్యక్తి.  పిల్లల భవిష్యత్తు కోసం అయినా ఒక మెట్టు దిగి ఫ్యాన్స్ ట్రోలింగ్ కి ఫుల్ స్టాప్ పెట్టొచ్చుగా.



ఒక్క మాట ఒకే ఒక్క మాట మా ఫ్యామిలీ మధ్య గొడవలు లేవు అంటూ ఒక్క స్టేట్మెంట్ పాస్ చేసిన సరే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి అది మంచి ప్లస్ గా మారుతుంది. మరింత స్థాయిలో సపోర్ట్ చేసేలా చేస్తుంది
. అయితే ఇప్పుడు మెగా మౌనం అందరికీ కొత్త డౌట్లు క్రియేట్ చేస్తుంది . కొడుకు కంటే అల్లు అర్జున్ ఎదిగిపోతాడేమో అన్న భయంతోనే కావాలని పుష్ప2  పై ట్రోలింగ్ జరుగుతున్న కూడా మెగాస్టార్ చిరంజీవి సైలెంట్ గా ఉన్నాడు అన్న కామెంట్స్ కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి.


లేకపోతే చిరంజీవి ఎప్పుడూ కూడా ఇలా బిహేవ్ చేసే వారే కాదు. అందరికీ సపోర్ట్ చేస్తూ వస్తారు.  మొనటికి మొన్న జీబ్రా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సత్యదేవ్ కి ఎలా సపోర్ట్ చేసారో అందరికీ తెలిసిన విషయమే. అలాంటిది అల్లు అర్జున్ లాంటి టాలెంటెడ్ హీరోని తొక్కేయడానికి సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ మెగాస్టార్ చిరంజీవికి తెలియనిది కాదు . మరి ఎందుకు సైలెంట్ గా ఉన్నాడు..?  మెగా మౌనం అల్లు  కొంప ముంచబోతుందా..? అంటూ జనాలు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: