అయితే ఇప్పుడు కొరటాల శివ భార్యకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. చాలామంది స్టార్ హీరో వైఫ్ లు..డైరెక్టర్ వైఫ్ లు..సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ బాగా పార్ష్ గా కనిపిస్తారు . కానీ కొరటాల శివ భార్య మాత్రం వీళ్ళందరికీ డిఫరెంట్ . సోషల్ మీడియాకి చాలా దూరంగా ఉంటుంది . అంతేకాదు ఆమె పర్సనల్గా తెలిసిన వాళ్ళకు మాత్రం ఆమె నిజంగా ఒక దేవతని అంటున్నారు జనాలు. కొరటాల శివ భార్య అరవింద ఆమె లండన్లో చదువుకున్నారు .
కొరటాల శివ లో ఉన్న నిజాయితీని చూసి ఆమె ప్రేమించగా ..ఆ ప్రేమ ..వివాహ బంధంతో ముడిపడింది . అయితే వీళ్ళకి పిల్లలు లేరు . అయినా సరే ఏమాత్రం బాధపడని ఈ జంట సమాజంలో ఉన్నవాళ్లంతా తమ పిల్లలే అనేగా భావిస్తూ ముందుకు వెళ్తున్నారు. అంతేకాదు ఎంత డబ్బు ఉన్నా సరే మనకి తినడానికి తిండి ఉండడానికి ఇల్లు ఉంటే సరిపోతుంది అనే విధంగా ఆలోచిస్తుంది అరవింద. అందుకే కొరటాల శివ - ఆమె .. సంపాదించిన దాంతో మొత్తం కూడా ప్రజాసేవకే ఖర్చు చేస్తూ ఉంటారట.
మొదటినుంచి అరవింద .. రామకృష్ణ పరమహంస భక్తురాలు .. ఆయన సూక్తులను ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటుంది. అంతేకాదు శ్రీమంతుడు కాన్సెప్ట్ ఆమె ఫిలాసఫీ నుంచి వచ్చిందేనట . అందుకే ఆ సినిమా అంత సూపర్ డూపర్ హిట్ అయింది. అంతేకాదు కోట్లు సంపాదిస్తున్న సరే అవసరానికి సరిపడా డబ్బులు మాత్రమే ఎత్తి పెట్టుకొని మిగతా డబ్బు ఉన్నంత సమాజసేవకే ఖర్చు పెడుతూ ఉంటుందట. దీంతో సోషల్ మీడియాలో అరవింద పేరు ని బాగా ట్రెండ్ చేస్తున్నారు . ఏ స్టార్ హీరో భార్య కూడా ఆమె కాలి కోటికి సరిపోదు అంటూ కొరటాల శివ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు..!