కొత్తగా విడుదలవుతున్న పుష్ప పాటలు, ట్రైలర్లను కంటెంట్ క్రియేటర్స్ బాగా వాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే కొంతమంది పిల్లలు కలిసి పుష్ప 2 ట్రైలర్ ఉన్నది ఉన్నట్లుగా రీ-క్రియేట్ చేశారు. ఈ పిల్లల పుష్ప-2 ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. చతుర్ అనే ఒక అబ్బాయి చాలా రోజులుగా అచ్చం అల్లు అర్జున్ లానే నటిస్తూ అందరినీ అవాక్కేలా చేస్తున్నాడు. ఇప్పుడు ఈ పిల్లోడే పుష్ప 2 ట్రైలర్ ను రీ క్రియేట్ చేశాడు. దానిని యూట్యూబ్ లో షేర్ చేశాడు. అది కాస్త ప్రస్తుతం అన్ని స్పెషల్ మీడియా సైట్స్ లో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది.
ఈ వీడియో ఓపెన్ చేస్తే మనకు చతుర్ బన్నీ ఒరిజినల్ ట్రైలర్ లో ఎలాంటి కాస్ట్యూమ్స్ వేసుకున్నాడో అలాంటి కాస్టమ్స్ వేసుకోవడం కనిపిస్తుంది. అంతేకాకుండా అతను డైలాగులకు చాలా చక్కగా లిప్ సింక్ ఇస్తాడు. అంతే కాదు బన్నీ లాగానే నటిస్తూ ముచ్చట గొలుపుతాడు. చతుర్ తో పాటు ఇందులో అతని స్నేహితులకు కూడా నటించారు. వారు చిన్న పిల్లలైనా బాగా నటించారు. ముఖ్యంగా ఒక కుర్రాడైతే ఫహద్ ఫాసిల్ డైలాగులకు అదిరిపోయే యాక్షన్ కనబరిచి వావ్ అనిపించాడు. ఈ ట్రైలర్ చూస్తుంటే ఒరిజినల్ ట్రైలర్ కి ఏమాత్రం తీసుపోని విధంగా ఉంది. ఈ పిల్లలు నిజమైన యాక్టర్లకు పోటీ ఇచ్చేలాగా నటించారు. ఇందులోని అన్ని సన్నివేశాలు చాలా రియలిస్టిక్ గా ఉన్నాయి. మీరు కూడా దీన్ని ఒకసారి చూసేయొచ్చు.