తాజా కథనాల ప్రకారం మెగాస్టార్ చిరంజీవికి అభిమాని అయిన శ్రీకాంత్ ఇటీవల లెజెండరీ నటుడికి ఒక కథను తెలియచేసాడని, ఈ ప్రాజెక్ట్‌కు చిరంజీవి నుండి అనుమతి కూడా ఇచ్చాడు అని సమాచారం. ఒకవేళ ఈ వార్త నిజమైతే, శ్రీకాంత్ తన కెరీర్‌లో ఒక మంచి అవకాశం అనే చెప్పాలి. మరొకవైపు, మెగాస్టార్ చిరంజీవి వరుసగా యంగ్ డైరెక్టర్లతో సినిమాలకు ఒకే చెప్తున్నారు. ప్రస్తుతం బింబిసారా దర్శకుడు వశిష్ఠతో 'విశ్వంభర' సినిమా చేస్తున్న సంగతి అందరికి విదితమే.
అయితే, అటు చిరు విశ్వంభర షూటింగ్ పూర్తి అయినా తర్వాత.. ఇటు నాని ‘ప్యారడైజ్’ మూవీ షూటింగ్ పూర్తయిన తర్వాత చిరంజీవి - శ్రీకాంత్ ఓదెల మూవీ షూటింగ్ మొదలు అవుతున్నట్టు సమాచారం. అలాగే, చిరంజీవి వీరాభిమాని అయిన శ్రీకాంత్ ఓదెల.. దసరా తర్వాతే మెగాస్టార్‌తో సినిమా చేయాలని అనుకున్నారట. కానీ, విశ్వంభర కారణంగా.. డేట్స్ లేకపోవడంతో నానితో ప్యారడైజ్‌ను చేసి అనంతరం మెగాస్టార్ తో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. చూడాలి మరి వీరిద్దరి కాంబినేషన్ ఫ్యాన్స్ ను ఎంతగా అక్కటుకుంటుందో. అలాగే నానిని దసరా సినిమాలో డిఫరెంట్ లుక్ తో చూపించిన శ్రీకాంత్.. ఇక చిరు సినిమాలో చిరున ఏ రేంజ్ లో చూపిస్తాడో చూడాలి మరి.