టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అల్లు అర్జున్ తాజాగా చేసిన సినిమా పుష్ప 2. ఇప్పటికే పుష్ప మొదటి భాగం రిలీజ్ అయి బంపర్ హిట్ అయింది. ఈ సినిమా... రెండేళ్ల కిందట రిలీజ్ అయి చరిత్ర సృష్టించింది. అయితే పుష్ప మొదటి భాగం సక్సెస్ కావడంతో రెండవ భాగం పైన అందరి చూపు పడింది. ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ అవుతుందో చూడాలని అందరూ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

 

ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ హీరోగా చేయగా రష్మిక మందాన హీరోయిన్గా చేసిన సంగతి మనందరికీ తెలిసిందే.  ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించగా ఐటమ్ సాంగ్ లో యంగ్ బ్యూటీ శ్రీ లీల  స్టెప్పులు వేయనుంది. కిస్ కిస్ కిసాక్ అంటూ హీరోయిన్ సమంతాను మైమరిపించేందుకు రెడీ అయింది. ఈ సినిమాలో శ్రీ లీల ఐటమ్ సాంగ్ చేస్తున్న నేపథ్యంలో హైప్ మరింత పెరిగింది.


అయితే సినిమా డిసెంబర్ ఐదో తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో... టికెట్ బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి.  తెలంగాణ రాష్ట్రంలో టికెట్ల ధరలు కూడా విపరీతంగా పెంచేశారు. ఒక్కో టికెట్ 1200 రూపాయలు వరకు ఉంది. దీంతో సినిమాపై మరింత హైప్ పెరగడం జరిగింది. అయితే ఇలాంటి నేపథ్యంలో...  అల్లు అర్జున్ కోసం... స్వయంగా ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.

 

ఏపీలో ఇంకా టికెట్ల ధరలు పెంచలేదు.  ఆ దిశగా పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారట.  ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశం కూడా అయ్యారట. ఇవాళ రాత్రి లేదా రేపు ఉదయం.. టికెట్ల ధర పెంపుపై.. ఓ క్లారిటీ రానుందట. అంతేకాదు..  ఏపీలో పుష్ప 2 సినిమాకు ఎక్కువ థియేటర్లు ఇచ్చేలా కూడా పవన్ కళ్యాణ్ ప్లాన్ చేస్తున్నారట.అల్లు అర్జున్ పైన కోపం పెట్టుకోకుండా.. సినిమా సక్సెస్ అయ్యేందుకు కృషి చేస్తున్నారట పవన్ కళ్యాణ్.

మరింత సమాచారం తెలుసుకోండి: