ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన కొన్ని పాటలు, టీజర్, ట్రైలర్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలను పెంచాయి. కేవలం ఈ సినిమా విడుదలకు మూడు రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించగా, రష్మిక మందన హీరోయిన్గా చేసింది. స్పెషల్ సాంగ్ లో శ్రీలీల స్టెప్పులు వేసింది. తాజాగా పుష్ప 2 సినిమా టికెట్ల ధరల పెంపు విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒక్కో టికెట్ కు రూ. 1200 వరకు తెలంగాణ ప్రభుత్వం పెంచింది.
దీంతో పుష్ప 2 టికెట్ల వ్యవహారం హైకోర్టుకు చేరుకుంది. టికెట్లు ధరలను భారీగా పెంచకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ విషయంపై హైకోర్టులో రేపు విచారణ కొనసాగనుంది. కాగా, ప్రీమియర్లకు టికెట్ ధరపై రూ. 800 పెంచడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అంటే ఒక్కో టికెట్ 1200 వరకు పెరిగింది. డిసెంబర్ 5 నుంచి 8 వరకు రూ. 200, ఆ తర్వాత కూడా టికెట్ల ధర పెంపునకు తెలంగాణ ప్రభుత్వం అనుమతిని ఇచ్చిన సంగతి తెలిసిందే.
మరి రేపు హైకోర్టులో టికెట్ల ధర విషయంపై న్యాయమూర్తి ఇలాంటి తీర్పు ఇస్తారో చూడాలి. కాగా, ఈరోజు పుష్ప 2 ప్రీ రిలీజ్ హైదరాబాద్ లోని యూసఫ్ గూడాలో జరుగుతోంది. ఈవెంట్ కి అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. ఇలాంటి నేపథ్యంలో హైకోర్టులో కేసు వేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.