ఏంటి రష్మిక మందన్నా అందరూ చూస్తుండగానే ఆ మ్యూజిక్ డైరెక్టర్ కి ప్రపోజ్ చేసిందా..స్టేజ్ పైనే అంత ధైర్యంగా రష్మిక ఎవరికి ప్రపోజ్ చేసింది..మధ్యలో రౌడీ హీరో ఏమైపోవాలి అంటూ చాలామంది నెటిజెన్స్ రష్మిక మాట్లాడిన వీడియోని నెట్టింట షేర్ చేస్తున్నారు.ఇక అసలు విషయంలోకి వెళ్తే.. ప్రస్తుతం ఎక్కడ చూసినా పుష్ప టు హవానే నడుస్తోంది. ఇప్పటికే ప్రమోషన్స్ మొదలుపెట్టి మరో రెండు రోజుల్లో విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమాపై భారీ హోప్స్ ఉన్నాయి.మరి కొన్ని గంటల్లో కొన్నిచోట్ల ప్రీమియర్స్ కూడా పడతాయి. అలా సినిమా విడుదలకు ముందు భారీ ఈవెంట్లు చేసి సినిమాపై ఎన్నో అంచనాలు తీసుకువచ్చారు చిత్ర యూనిట్.

అయితే తాజాగా ఈ సినిమాకి సంబందించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఘనంగా నిర్వహించారు మూవీ మేకర్స్.ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డైరెక్టర్ హీరో హీరోయిన్ ఇలా ప్రతి ఒక్కరు స్టేజ్ మీదకు ఎక్కి వారి అనుభవాలను అభిమానులతో షేర్ చేసుకున్నారు.ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎంతోమంది అల్లు,మెగా అభిమానులు వచ్చి ఈ ఈవెంట్ ని సక్సెస్ చేశారు.. అయితే అల్లు అర్జున్  రష్మిక మందన్న కాంబోలో వస్తున్న పుష్ప టు మూవీ డిసెంబర్ 5న విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమా గురించి రష్మిక స్టేజ్ మీద మాట్లాడుతూ..ఈ సినిమా కోసం మేమెంత కష్టపడ్డామో సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది.

అలాగే ఎంతోమంది టెక్నీషియన్లు ఈ సినిమా కోసం కష్టపడ్డారు. ఇక ఈ మూవీకి మ్యూజిక్ అందించిన దేవిశ్రీప్రసాద్ గారు చాలా కష్టపడ్డారు. ఆయన మ్యూజిక్ ఈ సినిమాకి పెద్ద ప్లస్ అవుతుంది అంటూ చెప్పింది. అంతే కాదు అందరి ముందే స్టేజ్ మీద రష్మిక మందన్నా దేవిశ్రీప్రసాద్ కి  ఐ లవ్ యూ అంటూ చెప్పింది. ప్రస్తుతం రష్మిక దేవిశ్రీకి ప్రపోజ్ చేసిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఇక ఈ వీడియో చూసిన రౌడీ ఫ్యాన్స్ షాక్ అయిపోయారు. అంతేకాదు కొంతమంది నెటిజన్స్ అయితే దేవిశ్రీప్రసాద్ కి ప్రపోజ్ చేస్తే మరి రౌడీ హీరో ఏమైపోవాలి అంటూ కామెంట్లు పెడుతున్నారు


మరింత సమాచారం తెలుసుకోండి: