టాలీవుడ్ డైరెక్టర్ సుకుమార్ పేరు చెప్పగానే అందరికీ పుష్ప సినిమాని గుర్తుకు వస్తోంది. ఎందుకంటే ఈ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా భారీ పాపులారిటీ సంపాదించుకున్నారు. ప్రస్తుతం పుష్ప -2 సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో బిజీగా ఉన్న సుకుమార్.. నిన్నటి రోజున హైదరాబాద్లో చాలా గ్రాండ్గా జరిగింది.. అక్కడికి అల్లు అర్జున్,అనసూయ ,శ్రీ లీల, రాజమౌళి ,అనిల్ రావుపూడి, దేవిశ్రీప్రసాద్ తో పాటుగా సుకుమార్ భార్య తబిత కూడా రావడం జరిగింది.. అయితే అక్కడ మాట్లాడిన మాటలకు సెలబ్రిటీల అందరి కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి.

సుకుమార్ భార్య తబిత.. పుష్ప-2 చిత్రం కోసం సుకుమార్ పడిన కష్టాన్ని ఏవి రూపంలో ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో నిన్నటి రోజున హైదరాబాదులో ప్రదర్శించడం జరిగింది.ఈ వీడియో చూసిన తర్వాత సుకుమార్ భార్య తబిత కన్నీళ్లు పెట్టుకున్నారు. పుష్ప సిరీస్ కోసం తన భర్త పడిన కష్టాన్ని సైతం ఆమె గుర్తు చేసుకొని మరి తీవ్ర బాగా ద్వేగానికి గురైనట్టుగా తెలుస్తోంది.అల్లు అర్జున్ చెప్పిన మాటలను విన్న తర్వాత తబిత మరింత ఎమోషనల్ అయినట్టుగా కనిపిస్తోంది. సుకుమార్ అనే వ్యక్తి లేకపోతే ఈ స్టైల్ స్టార్ లేడు ఐకాన్ స్టార్ లేడు అంటూ చెప్పిన డైలాగులతో మరింత ఎమోషనల్ గా అయ్యింది తబిత.అందుకు సంబంధించి ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది. ఈనెల 5వ తేదీన పుష్ప-2 చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్నది.


రీసెంట్గా సుకుమార్ భార్య తబిత కూడా మారుతి నగర్ సుబ్రహ్మణ్యం అనే చిత్రంతో నిర్మాతగా కూడా మారింది. అప్పుడప్పుడు పలు రకాల ఈవెంట్స్ కి కూడా వస్తూ ఉంటుంది ఈమె.. మొత్తానికి తన భర్త పడిన కష్టాన్ని చూసి చాలా ఎమోషనల్ గా అవ్వడంతో అభిమానులు కూడా ఎమోషనల్ గానే కామెంట్స్ చేస్తున్నారు.. సుకుమార్ పక్క నుండి ఓదారుస్తున్నప్పటికీ కూడా తబిత కంటి నుండి నీరు ఉబికి వస్తున్నట్టుగానే కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: