టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలో నటించే హీరోలను ఓ సూపర్ మెన్,స్పైడర్ మెన్ అనే రీతిలో భావిస్తూ ఉంటారు ప్రేక్షకులు దాంట్లో భాగంగానే హీరో కొడితే పదిమంది గాల్లోకి ఎగరాలని ప్రతి సీన్ లో  విలన్ ని హీరో డామినేట్ చేస్తూ ఎక్కడా ఎలివేషన్స్ తగ్గకూడని అభిమానులు ఆశిస్తుంటారు.అయితే ఏ సినిమాలోనైనా స్టార్ హీరోల ఎంట్రీ అనేది 5 నిమిషాల్లో ఇచ్చేయాలి.ఆ వెంటనే అతనికి ఓ భారీ ఫైట్ తర్వాత ఒక సాంగ్ అది కూడా హీరో ఇంట్రడక్షన్ సాంగ్ మాదిరి ఉండాలి. అందులో కూడా హీరోని పొగుడుతూ లిరిక్స్ ఉండాలి ఒకప్పటి స్టార్ డైరెక్టర్స్ మన తెలుగు ప్రేక్షకులను అలా ప్రిపేర్ చేశారు. కె.రాఘవేంద్రరావు వంటి స్టార్ డైరెక్టర్స్ కూడా ఓ సందర్భంలో అయిదు నిమిషాలకే హీరో ఎంట్రీ ఉండకపోతే ప్రేక్షకులు బోర్ ఫీలవ్వడం మొదలుపెడతారు. అలాగే హీరోకి ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉండాలంటూ చెప్పుకొచ్చారు. అయితే కొన్ని సినిమాల్లో మాత్రం హీరోల ఎంట్రీలు డిలే అవుతూ స్క్రీన్ స్పేస్ తర్వాత అన్నట్టు ఇప్పటి హీరోలు వ్యవహరిస్తున్నారు.ఈ క్రమంలో పావుగంట దాటినా హీరోలు ఎంట్రీ లేని సినిమాల లిస్ట్ లో మన మాస్ మహారాజా రవితేజ వున్నారు.

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన సినిమాల్లో ఆల్ టైం సూపర్ హిట్ మూవీ ఏది అంటే చెప్పే సినిమాల్లో రాజా ది గ్రేట్ సినిమా ఒకటి.టాలీవుడ్ సక్సెస్ ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.ఈ సినిమాలో రవితేజ అంధుడి పాత్రలో నటించాడు. ఈ సినిమా అద్భుతంగా నటించి మెప్పించారు.ఈ మూవీలో రవితేజ సరసన మెహరీన్ హీరోయిన్ గా నటించింది. అలాగే ప్రకాష్ రాజ్, రాధిక ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మించాడు. సాయి కార్తీక్ సంగీతం అందించాడు.ఈ సినిమా తర్వాత రవితేజ ఆ రేంజ్ హిట్ అందుకోలేకపోయారు.ఈ క్రమంలో రాజా ది గ్రేట్ లో రవితేజ ఎంట్రీ 'వెల్కమ్ టూ మై వరల్డ్ అంటూ'  పావుగంట దాటాకే ఉన్నప్పటికి ఈ సినిమాను ప్రేక్షకులు మంచి విజయాన్ని అందించారు.ఇదిలావుండగా ఈ సినిమా కథ విషయానికొస్తే 2017 అక్టోబర్ 18 న ప్రేక్షకుల ముందుకు  రాజా ది గ్రేట్ అంటూ వచ్చాడు మన మాస్ మహారాజ రవితేజ.విభిన్నమైన పాత్రలతో, హై ఎనర్టీ అటిట్యూడ్‌తో తెరపైన కనిపించే రవితేజ ఈ సారి ఓ ప్రయోగానికి ఒడిగట్టాడు.రాజా ది గ్రేట్‌లో అంధుడి పాత్రలో కనిపించాడు. కామెడీ, సెంటిమెంట్, యాక్షన్ అంశాలను మేలవించి రూపుదిద్దుకున్న చిత్రమిది.

మరింత సమాచారం తెలుసుకోండి: