ఇక ఆ తర్వాత వచ్చిన కల్కి సినిమా ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభాస్ రేంజ్ ఏంటి అన్న విషయాన్ని మరోసారి అందరికీ అర్థమయ్యేలా చేసింది. ఏకంగా 1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి నిర్మాతలకు లాభాల పంట పండించింది కల్కి మూవీ. కాగా ఇక ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు ప్రభాస్. ఈ క్రమంలోనే మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాజా సాబ్ అనే సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. ఇక ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన ప్రభాస్ ఫస్ట్ లుక్ అభిమానులు అందరిలో కూడా అంచనాలను పెంచేసింది అన్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే ఈ మూవీ ఎలా ఉండబోతుందో అనే విషయంపై అందరిలో అంచనాలు అంతకంతకు పెరిగిపోతున్నాయ్. ఇక మూవీ టీజర్ ఎప్పుడు వస్తుందో అని అభిమానులు కూడా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు అని చెప్పాలి. ఇలాంటి సమయంలో అటు రాజా సాబ్ మూవీ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. క్రిస్మస్ కానుకగా టీజర్ విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పనులు ప్రస్తుతం వేగంగా జరుగుతున్నాయని ఒక టాక్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. దీంతో క్రిస్మస్ ఎప్పుడు వస్తుందో అని అటు అభిమానులు ఎదురు చూడటం మొదలుపెట్టారు. కాగా ఈ మూవీలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా.. తమ సంగీతం అందిస్తున్నారు అన్న విషయం తెలిసిందే.