కోలీవుడ్ నటుడు కార్తీ సినిమాల్లోకి వచ్చి ఇన్ని సంవత్సరాలైనా కూడా ఆయన చేసిన సినిమాల్లో కొన్ని సినిమాలు మాత్రమే ప్రేక్షకధారణ పొందాయి. నటుడు సూర్య సోదరుడిగా శివ కుమార్ తనయుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన కార్తీ ఎన్నో సినిమాలో నటించి తమిళ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.అయితే అలాంటి కార్తి ఇప్పటివరకు చేసిన సినిమాలన్నింటిలో ఖైదీ ది బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు. మరి ఈ సినిమా విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

 లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఖైదీ సినిమాలో కార్తీ హీరోగా నటించారు. ఈ సినిమాలో హీరోయిన్ లేకుండానే కేవలం తన నటనతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. అలా కార్తితో పాటు రమణ, జార్జ్ మార్యన్, నరైన్, హరీష్ పేరడీలు కీలకపాత్రల్లో నటించారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై తిరుప్పూర్ వివేక్,ఎస్ఆర్ ప్రభు,ఎస్ఆర్ ప్రకాష్ బాబు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా 2019అక్టోబర్ 25న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.అయితే ఎప్పుడు రొమాంటిక్ సినిమాలు,ప్రేమకథా సినిమాలు చేసే కార్తీ తన భార్య చెప్పడంతో ఈ సినిమా చేశారట.. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎన్నో లవ్ రొమాంటిక్ సినిమాలు చేసి హిట్టు కొట్టిన కార్తీ పెళ్లయ్యాక ఇలాంటి లవ్ రొమాంటిక్ సినిమాలు చేసి ప్లాపులను తన ఖాతాలో వేసుకున్నారట.
 దాంతో డిప్రెషన్ లోకి వెళ్లిన కార్తీ ని చూసి ఆయన భార్య రంజని నువ్వు ఎప్పుడూ ఇలాంటి సినిమాలు తీస్తే ఎలా..

కాస్త కొత్తదనం చూపించాలి కదా. ఎప్పుడూ ఈ ప్రేమ కథా సినిమాలే కాకుండా నీ కటౌట్ కు తగ్గట్టు మాస్ మసాలా సినిమా ఏదైనా దొరికితే ఓసారి ట్రై చేసి చూడు .. కచ్చితంగా సినిమా హిట్ అవుతుంది అంటూ కార్తీకి సలహా ఇచ్చిందట. ఇక అదే సమయంలో లోకేష్ కనగరాజ్ కార్తీ దగ్గరికి వచ్చి ఖైదీ మూవీ స్టోరీ చెప్పారట.ఈ సినిమాలో ఎలాంటి లవ్ రొమాంటిక్ సన్నివేశాలు కూడా లేవు. కానీ ఈ సినిమా స్టోరీ నచ్చి చేసిన కార్తీ ఖాతాలో అతిపెద్ద బ్లాక్ బస్టర్ హిట్టు పడింది. అప్పటివరకు కార్తి చేసిన సినిమాలన్నింటిలోకెల్లా ఖైదీ మూవీ ది బెస్ట్ సినిమా అని చెప్పుకోవచ్చు. అలా భార్య చెప్పిన మాట విని కార్తీ ఖైదీ మూవీ తో ఇండస్ట్రీ హిట్ కొట్టారట. అయితే ఈ సినిమాలో కార్తీ ఎంట్రీ కాస్త లేటుగా ఉంటుంది.ఎంట్రీ లేటుగా ఉన్నప్పటికీ ఆయన కటౌట్ కి మాస్ యాంగిల్ బాగా సెట్ అవ్వడంతో సినిమాని ప్రేక్షకులు బాగా ఆదరించారు

మరింత సమాచారం తెలుసుకోండి: