ప్రస్తుతం సౌత్ ఇండియాలోనే కాదు అటు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో టాప్ కొరియోగ్రాఫర్ల గురించి చర్చ వచ్చినప్పుడల్లా జానీ మాస్టర్ పేరు మొదటి వరుసలోనే కనిపిస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ప్రస్తుతం టాప్ కొరియోగ్రాఫర్లలో ఒకరుగా కొనసాగుతున్న జానీ మాస్టర్ తన డాన్స్ లతో కుర్ర కారుకు కిక్కెక్కిస్తున్నాడు అని చెప్పాలి. ఇప్పటివరకు సూపర్ హిట్ అయిన ఎన్నో సాంగులకి జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశాడు. అయితే ఇక అలా టాప్ కొరియోగ్రాఫర్ గా కొనసాగుతున్న జానీ మాస్టర్ ఇటీవల ఒక వివాదం లో ఇరుక్కున్నాడు అన్న విషయం తెలిసిందే.


 జానీ మాస్టర్ దగ్గర ఎన్నో రోజులపాటు అసిస్టెంట్ గా పనిచేసిన ఒక అమ్మాయి ఏకంగా జానీపై లైంగిక ఆరోపణలు చేసింది తనపై అత్యాచారం చేయడంతో పాటు శారీరకంగా మానసికంగా తీవ్రంగా వేధించాడు అంటూ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. అయితే ఈ కేసు విచారణ నేపథ్యంలో జానీ మాస్టర్ జైలుకు కూడా వెళ్లాడు. ఇటీవలే బెయిల్ పై బయటికి వచ్చాడు అన్న విషయం తెలిసిందే. ఇలా బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతూ ఫ్యామిలీతో గడుపుతూ ఇది వరకులా హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తూ ఉన్నాడు.



 అయితే ఇలా లైంగిక ఆరోపణల తర్వాత జాని మాస్టర్ కు పెద్దగా అవకాశాలు రావట్లేదని టీవీ షోలకు కూడా పిలవట్లేదని ఒక టాక్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. అయితే ఇలా జైలు నుండి బెయిల్ పై వచ్చిన జానీ మాస్టర్ మళ్ళీ పని మొదలు పెట్టేసాడు అన్న విషయం అర్థమవుతుంది. ఇందుకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. వరుణ్ ధావన్ కీర్తి సురేష్ జంటగా నటించిన బేబీ జాన్ సినిమా నుంచి నైట్ మటక సాంగ్ కి స్టెప్పులు వేశారు జానీ మాస్టర్. తన అసిస్టెంట్ అయిన అమ్మాయి తో కలిసి ఈ సాంగ్కు అదిరిపోయే స్టెప్పులు వేశారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారిపోయింది.జానీ మాస్టర్ మళ్ళీ వర్క్ మొదలు పెట్టేసాడని ఆపడం ఎవ్వరి వల్ల కాదు అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: