పుష్ప 2 సినిమా కోసం నైజం లో టిక్కెట్ల పెంపు కోసం గేట్లు బార్లా తెరిచేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇప్పుడు ఏపీలో కూడా అదే రిపీట్ అయింది. తగ్గేదెలా అన్నట్టు తెలంగాణలో టికెట్ రేటు పెంచితే .. అసలు తగ్గేదేలే అన్నట్టు ఏపీలో కూడా టికెట్ రేట్లు పెంచేశారు. రెట్టించిన ఉత్సాహంతో స్పెషల్ జీవో జారీ చేశారు. ఏపీలో ఇప్పటివరకు టాలీవుడ్ సినిమా చరిత్రలో ఇదే హైయెస్ట్ కావటం విశేషం. నైజాంలో ఇచ్చినట్టుగానే ఏపీలో కూడా నాలుగో తేదీ స్పెషల్ రేటు 800 రూపాయలు చేశారు. ఇది నాలుగో తేదీ 9.30 గంటలకు ఉంటుంది. నైజాంలో ఐదవ తేదీ నుంచి ప్లాటుగా టిక్కెట్ రేట్లు పెంచితే .. ఏపీలో మాత్రం స్లాబ్ సిస్టం పెట్టారు. ఐదవ తేదీన ఆరు షోలకు అనుమతి ఇస్తేనే లోవర్ క్లాస్కు వంద రూపాయలు ... అప్పర్ క్లాస్ కు 150 రూపాయలు .. మల్టీప్లెక్స్ లో 2000 రూపాయల వరకు పెంచుకోవచ్చని జీవో ఇచ్చారు.


ఇక ఆరో తేదీ నుంచి 17వ తేదీ వరకు రోజుకు 5 షోలకు అనుమతి ఇచ్చారు. ఇక్కడ కూడా పైన చెప్పుకున్న టిక్కెట్ రేట్లు పెంపు కేటాయించారు. నైజాంలో అయితే ఏకంగా 19 రోజులు పాటు కంటిన్యూగా టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతులు రాగా ... ఏపీలో వరుసగా 13 రోజులు పాటు రేట్లు పెంచుకోవచ్చని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ఓ సినిమాకు ఈ స్థాయిలో టికెట్లు పెంపుపై ప్రత్యేక అనుమతి ఇవ్వటం ఇదే తొలిసారి. ఇంతకు ముందు రిలీజ్ అయిన పెద్ద సినిమాలు కల్కి - దేవరతో పోలిస్తే పుష్ప 2 కు భారీగా రిలాక్సేషన్ ఇచ్చినట్లు అయింది. మరి ముఖ్యంగా బెనిఫిట్ షో విషయంలో తగ్గేదేలే అన్నట్టుగా వ్యవహరించింది ఏపీ ప్రభుత్వం. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఒక కీలకమంత్రికి మైత్రి మూవీస్ సంస్థలో కొంత భాగస్వామం ఉందన్న ప్రచారం ఎప్పటినుంచో ఉంది. ఆ మంత్రి చేసిన లాబీయింగ్‌తో ఏపీలో ఈ స్థాయిలో టికెట్ రేట్లు పెంచారన్న ప్రచారం కూడా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: