ఆయన అన్నట్టు ఏది వాళ్ళు ఇవ్వరు మనమే మనకి కావాల్సింది మనమే అడిగి తీసుకోవాలి అని ..అది బాగా వర్కౌట్ అయినట్లుంది . ఆ కారణంగానే నిన్న జరిగిన హైదరాబాద్ ఈవెంట్ లో సైతం దేవి శ్రీ ప్రసాద్ ను ఒకటికి పది సార్లు మా దేవి మంచోడు.. మాదేవితో ఫ్రెండ్షిప్ మంచిది.. మా ఫ్రెండ్ షిప్ ఎప్పుడు ఇలానే ఉంటుంది అంటూ అడిగిన అడగకపోయినా సుకుమార్ - బన్నీ పదే పదే అదే చెప్పుకుంటూ వచ్చారు. కాగా స్టేజి పైకి వచ్చిన దేవిశ్రీప్రసాద్ మాట్లాడుతూ..కూసింత ఘట్టిగానే ఇచ్చిపడేశాడు.
వాళ్ల మధ్య బంధం-అనుబంధం గురించి మాట్లాడారు. అదే విధంగా స్టేజి పై కి వచ్చిన దేవి శ్రీ ప్రసాద్ బన్నీ గురించి మాట్లాడుతూ.. బన్నీతో ఫ్రెండ్షిప్ గురించి వివరిస్తూ వచ్చాడు. అదే విధంగా రష్మిక మందన్నా గురించి కూడా మాట్లాడాడు . "చూపే బంగారమాయేనే అంటూ శ్రీవల్లి గురించి పాట పాడుతూ ..శ్రీవల్లి అంటే పుష్పరాజ్ భార్య గానే ఊహించుకుంటున్నాను అని పొరపాటున ఏ స్టార్ హీరో సినిమాలో నటించిన కూడా అదేంటి ఇది మన పుష్పరాజ్ భార్య కదా వేరే హీరో తో నటిస్తుంది ఏంటి ..? అంటూ కోపం వచ్చేస్తుంది అని " సరదాగా మాట్లాడి స్టేజిపై నవ్వులు పూయించాడు. అంతేకాదు అక్కడ ఉన్న జనాలు సైతం పక్కపక్క నవ్వారు . అంతేకాకుండా దేవి శ్రీ ప్రసాద్ పుష్ప2 సినిమా కోసం ఎంత కష్టపడ్డాడు .. ఆయన చేసిన మ్యూజిక్ జనాలకి ఎంత బాగా నచ్చింది అనే విషయాన్ని కూడా బయట పెట్టాడు. సోషల్ మీడియాలో ప్రసెంట్ దేవిశ్రీప్రసాద్ కి సంబంధించిన ఈ కామెంట్స్ బాగా హైలైట్ గా మారాయి..!