ఈ మధ్యకాలంలో కొంతమంది హీరోల ఫ్యాన్స్ మరి టూమచ్ గా బిహేవ్ చేస్తున్నారు అంటున్నారు జనాలు.  మరీ ముఖ్యంగా ఏదైనా మీకు మీకు పడకపోతే మీకి మీకు మాత్రమే ఉండాలి . ఆ హీరో ఫ్యామిలీకి సంబంధించి ఆ హీరో భార్య పిల్లలకు సంబంధించి సోషల్ మీడియాలో అసలు వేలు పెట్టే దానికి ఇంట్రెస్ట్ చూపించకూడదు . అదే నిజమైన హీరో ఫ్యాన్స్ లక్షణం.  అసలు హీరోలు హీరోలు బాగానే ఉన్నప్పుడు హీరోల ఫ్యాన్స్ మాత్రమే ఎందుకు కొట్టుకొని చస్తున్నారో అర్థం కావడం లేదు. తాజాగా ఇద్దరు బడా హీరో ఫ్యాన్స్ మధ్య వార్ జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే . రీసెంట్గా పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది . చాలా చాలా ఖర్చుపెట్టి మైత్రి మూవీ మేకర్స్ వారు పుష్ప2 ఈవెంట్ ని కనులు పండుగగా జరిపించారు.


ఆఫ్ కోర్స్ ఈవెంట్లో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ బన్నీ - రష్మిక మందన్నా - శ్రీ లీల ఆ గ్లామర్ టచ్ ఇచ్చి ఈవెంట్ ని మరింత హైలెట్ గా మార్చారు . కాగా పుష్ప2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సుకుమార్ భార్య అదే విధంగా రాజమౌళి కూడా గెస్ట్ గా హాజరయ్యారు . అయితే రాజమౌళి కొన్ని అర్జెంట్ పనుల కారణంగా అలా వచ్చి ఇలా స్టేజిపై మెరిసి వెళ్లిపోయారు . ఈ క్రమంలోనే ఆ షో ఈవెంట్ కి హైలెట్గా నిలిచారు అల్లు అర్జున్ కూతురు కొడుకు . అయాన్ -అర్హ.



చాలా క్యూట్ గా చాలా ముద్దుగా స్టేజి పైకి వచ్చిన మాట్లాడిన వీడియో కూడా బాగా ట్రెండ్ అయింది.  చాలామంది అల్లు అర్హ క్యూట్ మాటలకు ఫిదా అయిపోతున్నారు. చాలా క్యూట్ క్యూట్ గా ఉంది అని ..అచ్చం అమ్మ పోలికే అని తక్కువ మాట్లాడుతుంది ఎక్కువ వర్క్ చేస్తుంది అంటున్నారు . అయితే అల్లు అర్జున్ కొడుకు అయాన్ మాత్రం కూసింత హెడ్ వెయిట్ చూపిస్తున్నాడు అంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు . అయాన్ ఎంట్రీ తోనే  ఆ విషయం అర్థం అయిపోయిందని ..నాన్నకు మించిపోయిన రేంజ్ లో హెడ్ వెయిట్ చూపిస్తున్నాడు అంటూ కొందరు హీరోల ఫ్యాన్స్ ఘాటుగా ట్రోల్ చేస్తున్నారు.



అల్లు అయ్యాన్ ఎంట్రీ ఇచ్చి సోఫాలో కూర్చొని గడ్డం కింద చేయి పట్టుకొని ఓ రేంజ్ లో నెక్స్ట్ పాన్ ఇండియా స్టార్ అయ్యానే  అన్నట్లు బిహేవ్ చేశారు . అయితే చిన్నపిల్లలకి అది ఏదీ తెలియదు.  చిన్నపిల్లలు ఎవరిని ఎలా చూస్తే అలా ఫాలో అవుతూ ఉంటారు . దానికి పోయి ఇలాంటి ట్రోలింగ్ చేయాలా ..? అంటూ బన్నీ ఫాన్స్ కూడా మండిపడుతున్నారు . కొంతమంది ఏకంగా అల్లు అర్జున్ పై ఉన్న కోపాన్ని ఆయన కొడుకు అయాన్ పై చూపిస్తున్నారు . ఇది చాలా తప్పు అంటూ కూడా సినీ విశ్లేషకులు మండిపడుతున్నారు .

అంతేకాదు అల్లు అయాన్ స్టేజ్ పైకి వచ్చి  ముద్దు ముద్దు ముద్దు ముద్దుగా తెలుగు మాట్లాడిన  విధానం అందరికీ నచ్చింది . కానీ పచ్చకామెర్లు వచ్చిన వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది అన్నట్లు బన్నీ అంటే ఇష్టం లేని వాళ్ళకి బన్నీ కొడుకు కూడా ఇష్టం లేకుండా ట్రోలింగ్ చేసే విధంగా మారిపోయారు . ఇంకా బన్నీ ఫాన్స్ అయితే అలాంటి వాళ్ళని ఏం చేయలేం దేవుడున్నాడు నాశనం అయిపోతారు .. చిన్నపిల్లాడిపై బూతు ట్రోలింగ్ సంక  నాకి పోతారు అని ఘాటుగా కౌంటర్ వేస్తున్నారు..!?

మరింత సమాచారం తెలుసుకోండి: