స్టార్ డైరెక్టర్ అనగానే అందరికీ మొదట గుర్తొచ్చేది రాజమౌళి . తెలుగు ఇండస్ట్రీ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు పాకేలా చేసిన జక్కన్న గురించి ఎంత చెప్పుకున్నా అది తక్కువగానే ఉంటుంది. అయితే ప్రజెంట్ రాజమౌళి - మహేష్ బాబుతో సినిమా కోసం చాలా చాలా కష్టపడుతున్నాడు . ఈ సినిమాని డిసెంబర్ రెండవ వారంలో సెట్స్ పైకి తీసుకురాబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది . కానీ అది ఎంతవరకు నిజమనే విషయం ఇంకా క్లారిటీ రాలేదు. కాగ రీసెంట్గా పుష్ప2 ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది . ఈ వేడుకకు చీఫ్ గెస్ట్ గా హాజరయ్యాడు రాజమౌళి . స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.


మరి ముఖ్యంగా సుకుమార్ - సుకుమార్ భార్య అదేవిధంగా రాజమౌళి ఎంట్రీ ఇచ్చిన సీన్స్ హైలైట్ గా మారాయి . బడా పాన్ ఇండియా స్టార్స్ అంటూ ప్రూవ్ చేశారు . కాగ స్పీచ్ ఇవ్వడానికి స్టేజి పైకి ఎక్కిన రాజమౌళి చాలా చాలా ఆహ్లాదకరంగా మాట్లాడుతూ అభిమానులను ఆకట్టుకున్నారు. అందరిలా లాంగ్ లెన్త్ స్పీచ్ కాకుండా సింపుల్ స్పీచ్ ఇచ్చి సినిమాకి ఎంత కావాలి ..ఏం కావాలి అన్న విధంగా మాట్లాడారు.  మరి ముఖ్యంగా పుష్ప2 సినిమాకి ప్రమోషన్ అక్కర్లేదు అని ..ఆల్రెడీ పుష్ప2 సినిమా హిట్ అయిపోయిందని చెప్పుకొచ్చాడు .



అంతేకాదు ఆ తర్వాత సినిమా డైరెక్టర్ సుకుమార్ స్టేజ్ పైకి వచ్చి పుష్ప2 సినిమా కోసం ఎంత కష్టపడ్డాం..? అసలు పుష్ప2 సినిమా ఎలా స్టార్ట్ అయింది..? అన్న విషయాన్ని చెప్పుకొచ్చారు . ఇదే మూమెంట్లు స్టేజి కింద ఉన్న బన్నీ ఫ్యాన్స్ పుష్ప3 ఎప్పుడు ఎప్పుడు అంటూ అరవడం ప్రారంభించారు . దీనితో రియాక్ట్ అయిన సుకుమార్ మీ హీరో మూడేళ్లు కాల్ షీట్స్ ఇస్తే పుష్ప3 కూడా తెరకెక్కిస్తా..? అంటూ స్టేజిపై ఓపెన్ గా చెప్పుకొచ్చాడు. అయితే గతంలో బాహుబలి 2 లో సైతం రాజమౌళి ఇదే కామెంట్స్ చేశారు .



బాహుబలి 2 ఈవెంట్ లో రాజమౌళి మాట్లాడుతున్నప్పుడు ..బాహుబలి 3 ఉందా..? అంటూ ప్ర్శ్నించారు ఫ్యాన్స్ . కచ్చితంగా ప్రభాస్ మరో ఐదేళ్ళు కాల్ షీట్స్ ఇస్తే మళ్లీ బాహుబలి 3 తెరకెక్కిస్తా అంటూ చెప్పుకొచ్చారు. అంతా హీరోల పైన నెట్టేసి కూల్ గా స్పీచ్ కంప్లీట్ చేశారు. అంతేకాదు ఏ సినిమా అయినా సరే రెండు పార్ట్లుగా తెరకెక్కించిన తర్వాత మూడో పార్ట్ తెరకెక్కిస్తే అది బోరింగ్ గా ఉంటుంది. అదే హీరో అదే హీరోయిన్ అదే కాంబినేషన్ కచ్చితంగా ప్లాప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి . ఆ ఫ్లాప్ ని తమ మీద వేసుకోకుండా హీరోలపై నెట్టేస్తూ హీరోలు కాల్ షీట్స్ ఇవ్వట్లేదు అని చెప్తే సరిపోతుంది అనుకున్నారో ఏమో అంటూ కొంతమంది ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు . మొత్తానికి ఆ విషయంలో రాజమౌళి - సుకుమార్ బాగా తప్పించుకున్నారు అన్న విషయం క్లారిటీ వచ్చేసింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: