స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వస్తున్నటువంటి బిగ్గెస్ట్ పాన్ ఇండియా చిత్రం పుష్ప-2. ఈ సినిమా రిలీజ్  డిసెంబర్ 5న సిద్ధమయ్యింది.. ఇందులో భాగంగానే ఇతర ప్రాంతాలలో కూడా ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని చాలా గట్టిగా ప్లాన్ చేశారు. నిన్నటి రోజున హైదరాబాదులో ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని చాలా గ్రాండ్ గా నిర్వహించి సక్సెస్ చేశారు. ఈ వేడుకకు ఈ చిత్రంలో నటించిన నటీనటులు అందరూ కూడా హాజరు కావడం జరిగింది. ఈ సినిమా విడుదల సమయం దగ్గర పడుతున్న కొద్ది డైరెక్టర్ సుకుమార్ భార్య తబిత కూడా ఒక ఆసక్తికరమైన వీడియోని షేర్ చేసింది.


పుష్ప మేకింగ్ గ్లింప్స్ అంటూ ఒక వీడియోని షేర్ చేయగా ఇందులో పుష్ప కోసం సుకుమార్, అల్లు అర్జున్ తో పాటుగా చిత్ర బృందం ఎలా కష్టపడ్డారనే విషయాన్ని తెలియజేస్తోంది.ఈ వీడియోకి ఒక ఎమోషనల్ క్యాప్షన్ కూడా జత చేయడం జరిగింది తబిత.. పుష్ప రైడ్ కేవలం ఆసక్తికరమైనది మాత్రమే కాదు చాలా ఎమోషనల్ కూడా ఇంట్లో కూర్చొని స్క్రిప్ట్ చదివే దగ్గర నుంచి స్టేజ్ పై నిలబడి ప్రశంసలందుకునే వరకు మీతోనే ఈ జర్నీ అంటూ ఇది చాలా స్ఫూర్తిదాయకం అంటూ తెలియజేసింది తబిత.. అలాగే మీ సక్సెస్ లో మీ పక్కన ఉన్నందుకు తనకు చాలా గర్వంగా ఉందంటూ తెలియజేసింది.


తన భర్త పడిన కష్టాన్ని సైతం మేకింగ్ వీడియో తోనే సక్సెస్ గురించి సుకుమార్ భార్య తబిత పోస్ట్ షేర్ చేయడంతో ఈ వీడియోని సోషల్ మీడియాలో అభిమానులు తెగ వైరల్గా చేస్తూ పాపులర్ చేస్తున్నారు. ముఖ్యంగా సుకుమార్ సైతం తనకు ఆరోగ్యం సరిగా లేకపోయినా కూడా లెక్కచేయకుండా ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమా ఇప్పటికే పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: