పుష్ప 2 టికెట్ రేట్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హైక్ నిర్మాతలకు మంచి బూస్ట‌ప్ విషయం. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. వందల కోట్లతో ఓ భారీ సినిమా తీసి తొలి వారంలోనే వీలైనంత పెట్టుబడి వెనక్కి తీసుకురావడం కోసం నిర్మాతలు టికెట్ రేట్లు పెంపుపై ఆశలు పెట్టుకుంటారు. ఇది ప్రతి సినిమాకు జరిగేదే. మైత్రి మూవీస్ కూడా అదే చేసింది. తెలంగాణ ప్రభుత్వం కూడా పెద్దమన‌సు చేసుకునే నిర్మాతలకు టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు కల్పించింది. అయితే ప్రీమియర్ షో టికెట్ రేట్లు మరీ ఎక్కువ అని ... సింగల్ స్క్రీన్ ... మల్టీప్లెక్స్ రేట్లు కూడా విపరీతంగా పెంచేశారని .. ఇలాగైతే సామాన్యుడు గతి ఏంటని ? కొంతమంది ప్రశ్నలు సంధిస్తున్నారు.


పుష్ప 2 సినిమా టికెట్ కొనాలంటే ఆసలు తాకట్టు పెట్టాలని జోకులు వేస్తున్నారు. ఈమధ్య ఏ సినిమాకి రానంత క్రేజీ పుష్ప 2 కు వచ్చింది. ఈ సినిమా ఎప్పుడు ఎప్పుడు చూద్దామా ? అని అల్లు అర్జున్ ఆర్మీ ఎదురు చూస్తుంది. వాళ్లకు టిక్కెట్ రేటు ఎంతున్నా పెద్దగా పట్టింపు ఉండదు. త్రిబుల్ ఆర్‌ ప్రీమియర్ షో టికెట్ ఒక్కొక్కటి నార్త్ లో రు. 3000 వరకు పలికింది .. అప్పట్లో అదే రికార్డు అయినా ప్రీమియర్ చూడటానికి ప్రేక్షకులు తహతహలాడిపోయారు.


ఇలా ప్రతి సినిమాకు ప్రీమియర్ షోలు .. బెనిఫిట్ షోలు .. తొలి వారం రోజులు అని ఇష్టం వచ్చినట్టు టికెట్ రేట్లు పెంచుకుంటూ పోతే సామాన్యుడు జేబుకు చిల్లు పడిపోతుంది. రేపు ప్రతి సినిమాకు ఏదో ఒక సాగుచూపుతో టిక్కెట్లు పెంచుకునేందుకు నిర్మాతలు ప్రభుత్వాలను ఆశ్రయించడం .. ప్రభుత్వలు ఒకే చెప్పటం కామన్ గా జరిగే ప్రక్రియ. ఏది ఏమైనా దేవర , క‌ల్కి సినిమాల‌కు ఒకరకంగా .. పుష్ప 2 సినిమాకు ఒకరకంగా టికెట్ రేట్లు పెంచుకునేలా ఉత్తర్వులు రావడం టాలీవుడ్ లో రగడకు గందరగోళానికి దారితీసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: