అయితే పుష్ప 2 విషయంలో గేట్లు బార్ల తెరిచేశారు. ఏకంగా 19 రోజులపాటు టిక్కెట్ రేట్ల పై పెంపు ఉంది. ఇలా ఇప్పటివరకు ఏ సినిమాకు జరగలేదు. పెద్దగా గ్రాఫిక్స్ .. భారీ సెట్లు అవసరంలేని ఓ సినిమాను మూడేళ్లు తీసి ఆ భారాన్ని ప్రేక్షకులపై మోపటం ఎంతవరకు ? సమంజసం అన్న ప్రశ్న వస్తోంది. అలా మొదలైందే బాయ్‌కాట్ పుష్ప 2. రైతులకు కనీసం మద్దతు ధర పెంచరు కానీ .. సినిమా టిక్కెట్ రేట్లు మాత్రం పెంచేస్తారు అంటూ ఓ ప్రేక్షకుడు ఫైర్ అయ్యాడు. మరో ప్రేక్షకుడు అయితే ఇలా చేసుకుంటూ పోతే బాలీవుడ్ కి పట్టిన గతే టాలీవుడ్ కి కూడా పడుతుంది.. ఇంత ధరలు పెట్టి చూసే బదులు సంవత్సరం మొత్తం ఓటిటి ప్లాన్ వచ్చేస్తుంది కదా అప్పుడు చూసుకోవచ్చు అంటున్నారు మరికొందరు.
ఇలా చూస్తూ పోతే వందలాది బాయ్‌కాట్ ట్వీట్స్ కనిపిస్తున్నాయి సోషల్ మీడియాలో. కేవలం సినిమాపై అభిమానుల అభిమానాన్ని ఒక రకమైన ఎమోషనల్ బ్లాక్మెయిల్ తో క్యాష్ చేసుకుంటున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. వంద రూపాయల టికెట్ ని రు. 350 చేయటం ద్వారా అనుకుంటే ఇప్పుడు రు. 1200 చేసేసారు. ఏది ఏమైనా ఈ టిక్కెట్ రేట్ల పెంపు అనేది పెరుగుట విరుగుట కొరకే అన్నట్టుగా ఇండస్ట్రీ పతనానికి కారణమవుతుందన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.