రష్మిక మందన్నా.. స్టేజ్ పైకి వస్తే చాలు ఎప్పుడెప్పుడు ఆమె బాయ్ ఫ్రెండ్ గురించి అడుగుతామా..? అంటూ చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు . మొన్నటికి మొన్న పుష్ప2 మ్యూజికల్ నైట్ చెన్నైలో జరగక అక్కడ హోస్ట్  ప్రశ్నించిన తీరు రష్మిక మందన్నా.. చేత నిజాన్ని బయటపెట్టించే విధంగా చేసింది . రష్మిక మందన్నా.. బాయ్ ఫ్రెండ్ విజయ్ దేవరకొండ అనే అంటూ అనఫిషియల్ గా కన్ఫామ్ చేసినంత పరిస్థితి వచ్చింది. మీరు ఏ రంగానికి చెందిన వారిని పెళ్లి చేసుకోబోతున్నారు..? సినిమా రంగానికా..? లేకపోతే వేరే రంగాన్ని సంబంధించిన వారా..? అని అడగ్గా "ఆ విషయం అందరికీ తెలిసిందే.. ప్రత్యేకంగా చెప్పాలా..?" అంటూ రష్మిక మందన్నా  పరోక్షకంగా తనకు విజయ్ దేవరకొండకు మధ్య ఉన్న రిలేషన్ షిప్ ని బయటపెట్టేసింఫ్ది.


ఇప్పుడు అందరు విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నా ల గురించి మాట్లాడుకోవడం ప్రారంభించారు.  అయితే ఆ తర్వాత ఏ ఈవెంట్లో కూడా అలాంటి ప్రశ్న ఎదురయ్యే స్థాయికి రష్మిక తీసుకురాలేదు.  కానీ నిన్న జరిగిన హైదరాబాద్ ఈవెంట్ లో  మాత్రం స్టేజి పైకి రాగానే సుమ.. రష్మిక మందన్నా మీరు చెన్నైలో చాలా చాలా మాట్లాడేశారు అంటూ పరోక్షకంగా విజయ్ దేవరకొండ గురించి ప్రశ్నించగా.. వెంటనే రష్మిక మందన్నా అందుకొని "ప్లీజ్ ఇప్పుడు దాని గురించి అవసరం లేదు ..అది అక్కడ అయిపోయింది ..ఇక్కడ అది అవసరం లేదు అనుకుంటున్నాను " అంటూ వెంటనే ముఖం తిప్పుకొని జనాల వైపు చూస్తూ మాట్లాడింది.



తనదైన స్టైల్ లో స్పీచ్ ఇస్తూ సినిమా కోసం తాను ఎంత కష్టపడ్డాను అన్న విషయాన్ని బయట పెట్టడమే కాకుండా సినిమా టీం తో ఉన్న అనుబంధాన్ని కూడా బయటపెట్టింది . మధ్య మధ్యలో సైతం అరె అరె అంటూ ఊర్రుతలు ఊగించే విధంగా మాట్లాడింది . లాస్ట్ లో రాంప్ వాక్ చేస్తున్నట్లు స్టేజిపై నడిచి "సూసేకి అగ్గి రవ్వ మాదిరి " సాంగ్ కి స్టెప్స్ వేసింది . అయితే సుమతో కలిసి స్టెప్స్ వేసి అంతకుముందు ఆమె బిహేవ్ చేసిన పద్ధతికి హర్ట్ కాకుండా కూల్ చేసేసింది .



ఆ తర్వాత ఒక హగ్గు కూడా ఇచ్చింది లేండి . అయితే సుమ మాట్లాడిన దాంతో ఏమి ఇబ్బందికరంగా లేదు ..చెన్నై ఈవెంట్ లోనే విజయ్ దేవరకొండ గురించి బయటపెట్టినప్పుడు మన తెలుగు స్టేజ్ పై ఎందుకు బయట పెట్టకూడదు అన్న వాదన జనాలలో వినిపిస్తుంది . అయితే విజయ్ దేవరకొండ నుంచి స్ట్రాంగ్ వార్నింగ్ వచ్చినట్లు ఉందని ఆ కారణంగానే రష్మిక మందన్నా ఆ విషయం గురించి మాట్లాడకుండా తప్పించుకోవడానికి ఇలా చేసింది అంటున్నారు . మొత్తానికి రష్మిక మందన్నా బిహేవ్ చేసిన పద్ధతి ఇప్పుడు సుమ ఫాన్స్ కి అస్సలు నచ్చడం లేదు..!

మరింత సమాచారం తెలుసుకోండి: