యంగ్ టైగర్ ఎన్టీఆర్ .. 20 సంవత్సరాల వయసులోనే హీరోగా ఎంట్రీ ఇచ్చాడని అందరికీ తెలుసు .. వీఆర్ ప్రతాప్ దర్శకత్వంలో నిన్ను చూడాలని సినిమాతో ఎన్టీఆర్ హీరోగా పరిచయం అయ్యారు. అయితే తొలి సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది ఎన్టీఆర్ కి కూడా సరిగ్గా గుర్తింపు రాలేదు.. ఎమోషనల్ లవ్ స్టోరీ గా ఈ సినిమా తెరకెక్కింది. తొలి సినిమాతోనే ఎదురు దెబ్బ తగలడంతో రెండో సినిమాతో అయినా హీట్ కొట్టాలని... లేకుంటే కెరియర్ పై తీవ్ర ప్రభావం పడుతుందని భావించరు. అదే సమయంలో ఎన్టీఆర్  కెరీర్ ను నిలబెట్టేందుకు రాఘవేంద్రరావు రంగం లోకి దిగారు .. అప్పటికే మహేష్ బాబుని హీరోగా లాంచ్ చేసి నా రాఘవేంద్రరావు సక్సెస్ అయ్యారు.
 

ఇక ఇప్పుడు మరో వారసుడి కెరీర్ ని నిలబెట్టే బాధ్యత ఆయనపై పడింది .. ఎన్టీఆర్ సెకండ్ మూవీగా స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా ఫిక్స్ అయింది.. అయితే రాఘవేంద్రరావు తను దర్శకత్వం వహించకుండా ఈ సినిమా బాధ్యతని ఆయన శిష్యుడు రాజమౌళికి  అప్పగించారు.. ఇక‌ తాను దర్శకత్వ పర్యవేక్షణ బాధ్యతలు మాత్రం చూస్తానని  చెప్పారు. ఇక రాజమాలికి కూడా ఇదే మొదటి సినిమా .. పాటలపై పెద్దగా రాజమౌళికి అవగాహన ఉండేది కాదట. రాఘవేంద్రరావు మాత్రం సాంగ్స్ ని తెరకెక్కించడంలో ట్యూన్ ని సెలెక్ట్ చేయటంలో దిట్ట .. షూటింగ్ ప్రారంభానికి ముందే రాఘవేంద్రరావు కొన్ని సాంగ్స్ కి కీరవాణితో కలిసి ట్యూన్స్ ఫైనల్ చేశారట .. కీరవాణి ఆ ట్యూన్లని  రాజమౌళికి వినిపించారు. అలాగే స్టూడెంట్ నెంబర్ వన్ లో సూపర్ హిట్ అయిన పాటల్లో కాలేజ్ ఫేర్వెల్ లో జరిగే ... ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి అనే పాట .. అదే విధంగా పడ్డానండి ప్రేమలో మరి అనే సాంగ్స్ కూడా ఉన్నాయి.


ఎక్కడో పుట్టి అనే సాంగ్ రాజమౌళికి పర్వాలేదనిపించింది అట. కానీ పడ్డానండి ప్రేమలో మరి అనే సాంగ్ అస్సలు నచ్చలేదట. కీరవాణితో.. అన్నయ్య ఏంటి ఈ పాట అస్సలు బాగాలేదు అని చెప్పాడట. కీరవాణి బదులిస్తూ.. లేదు రాజమౌళి, రాఘవేంద్ర రావు గారు సెలెక్ట్ చేశారంటే అందులో విషయం ఉంటుంది. సాంగ్ మంచి హిట్ అవుతుంది చూడు అని చెప్పారట. స్టూడెంట్ నెంబర్ 1 ఆడియో క్యాసెట్స్ విడుదలై ప్రతి సాంగ్ సూపర్ హిట్ అయింది. పడ్డానండి ప్రేమలో మరి సాంగ్ ని యూత్ విపరీతంగా ఎంజాయ్ చేశారు. అప్పడే అనుకున్నా.. ఓహో మనకి సాంగ్స్ లో జీరో నాలెడ్జ్ అంటూ రాజమౌళి నవ్వుతూ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇక ఈ సినిమా విజయంలో పాటలు ఎంతో కీలకపాత్ర పోషించాయి .. రాఘవేంద్రరావు ఇన్వాల్వ్మెంట్ లేకుంటే జక్కన్న స్టూడెంట్ నెంబర్ వన్ సాంగ్స్ ని ఏం చేసేవాడో.. ఆపై సినిమా రిజల్ట్ ఎలా ఉండేదో .. ఆ తర్వాత రాజమౌళి సినిమాల్లో ఎలాంటి సాంగ్‌ వచ్చిన అందులో రాఘవేందరావు స్టైల్ కచ్చితంగా ఉంటుందని ఇప్పటికీ అంటున్నారు. ఇలా ఎన్టీఆర్ రెండో సినిమా సక్సెస్ అవ్వటంలో రాఘవేంద్రరావు పాత్ర ఎంతో కీలకంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: