ఇప్పటివరకు హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకున్న టాప్ 5 తెలుగు మూవీలు ఏవో తెలుసుకుందాం.

పుష్ప 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను ఈ సంవత్సరం డిసెంబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ బిజినెస్ కంప్లీట్ అయింది. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 617 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఈ తెలుగు సినిమాకు కూడా ఈ స్థాయి ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగలేదు. దానితో ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ను జరుపుకున్న తెలుగు సినిమాలలో పుష్ప పార్ట్ 2 మూవీ మొదటి స్థానంలో నిలిచింది.

ఆర్ ఆర్ ఆర్ : రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 451 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకున్న తెలుగు సినిమాల లిస్టులో ఈ మూవీ రెండవ స్థానంలో నిలిచింది.

కల్కి 2898 AD : ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు 370 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకున్న తెలుగు సినిమాల లిస్టులో ఈ మూవీ 3 వ స్థానంలో నిలిచింది.

బాహుబలి 2 : ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 352 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకున్న తెలుగు సినిమాల లిస్టులో ఈ మూవీ 4 వ స్థానంలో నిలిచింది.

సలార్ : ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు 345 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకున్న తెలుగు సినిమాల లిస్టులో ఈ మూవీ 5 వ స్థానంలో నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: