నటరత్న ఎన్టీఆర్ గురించి ఆయన జీవితం గురించి ఎంత చెప్పుకున్న ఏదో ఒక విషయం ఎప్పుడు బయటకు వస్తూనే ఉంటుంది .. ఇదే క్రమంలో ఎన్టీఆర్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వ్యాఖ్యలకు ఆయన ఎంతో ఆకర్షితులయ్యేవారు .. ఆయన చెప్పిన మాటలను తూచా తప్పకుండా ఎప్పుడు చదువుతూ ఉండేవారు..  అయితే తేర మీద బొమ్మలే పాలన చేస్తాయి అనే బ్రహ్మంగారి మాట ఎన్టీఆర్ దృష్టిని ఎంతగానో ఆకర్షించడంతో .. బ్రహ్మంగారి చరిత్రను సినిమాగా తీయాలని ఓ సంకల్పం చేసుకున్నారు .. ఎన్టీఆర్ అనుకున్నది తడువుగా కథ సిద్ధం చేసి సినిమా కూడా తీశారు .


ఎన్టీఆర్ లాంటి ఒక మహానుభావుడు పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర సినిమాగా తీస్తాను అంటే కాదు అనేవారు ఎవరైనా ఉంటారా ? కానీ అప్పటికే ఎన్నో మాస్ కమర్షియల్ లాంటి సినిమాలు వస్తున్న సందర్భంలో ఇలాంటి ఒక ఆధ్యాత్మికంతో కూడిన సినిమా తీస్తే ప్రేక్షకులకు నచ్చుతుందో లేదో అని అనుమానం మాత్రం కొందరిలో ఉండేది.  ఇక విషయం ఏదైనా ఎన్టీఆర్ తలుచుకున్నాక ఆ పని ఆగదు .. ఈ సినిమాను ఆయనే సొంతంగా తెర‌కెక్కించారు విడుదలైన ఆరు రోజుల్లోనే కోటి రూపాయలు, లాంగ్ రన్ లో 6 కోట్ల రూపాయలకు కలెక్షన్లు రాబట్టింది .. అయితే ఈ సినిమాను తమిళనాడులో కూడా విడుదల చేయాలనుకున్నారు .. అప్పటికి తెరమీద బొమ్మలు పాలన చేస్తాయి అన్న మాటకు ఎంజి రామచంద్రన్ ఉదాహరణగా నిలిచారు.

 

ఆయన ముఖ్యమంత్రిగా తమిళనాడులో ఉన్నారు. అయితే ఈ విషయం ఆ నోట ఈ నోట కాంగ్రెస్ ప్రభుత్వానికి  తెలిసింది. అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ఈ సినిమాపై దృష్టి పెట్టారు. తెలుగు రాష్ట్రాల్లో సృష్టించిన ప్రభంజనం కూడా తెలుసుకున్నారు .. దాంతో తమిళనాడులో ఈ సినిమాను విడుదల చేయకూడదని ఆమె కంకణం కట్టుకున్నారు అలా ఏడాది పాటు సెన్సార్ జరక్కుండా ఈ సినిమా విడుదల కాకుండా ఆపారు. కానీ ఆ తర్వాత ఎన్నో రోజులు ఆపలేరు .. కాబట్టి చివరికి ఈ సినిమా విడుదలై అక్కడ కూడా మంచి విజయాన్ని సాధించింది. ఆయన నిజంగానే ఆ తర్వాత రోజుల్లో ముఖ్యమంత్రిగా ఎన్నికైన సంగతి మనందరికీ తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన ప్రచారం చేసి తొమ్మిది నెలలకే తెలుగువాడి అభిమానం అనే మాటతో అభిమానుల మనసులు గెలుచుకుని ముఖ్యమంత్రి అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: