త్రిష గురించి తెలియని వారంటూ ఉండరు. 20 ఏళ్ల కిందట సినీ ఇండస్ట్రీకి పరిచయమైన ఈ చిన్నది వర్షం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలో తన అద్భుతమైన నటనకు గాను ఎన్నో అవార్డులు సైతం వచ్చాయి. ఈ సినిమాలో త్రిష అద్భుతంగా నటించింది. వర్షం సినిమా అనంతరం త్రిష వెనుతిరిగి చూసుకోకుండా వరుస పెట్టి సినిమాలలో నటించి ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్గా నిలిచింది.
తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ సినిమాలలో నటించి తన హవాను కొనసాగించింది. ఈ బ్యూటీ ఇండస్ట్రీకి పరిచయమే 20 ఏళ్లకు పైన అవుతుంది. కొద్దిరోజుల క్రితం త్రిష హవా ఇండస్ట్రీలో కాస్త తగ్గిపోయింది. యంగ్ హీరోయిన్లు ఇండస్ట్రీకి పరిచయం అవడంతో ఈ బ్యూటీని ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. మళ్లీ ఈ మధ్యకాలంలో కొన్ని సినిమాలలో నటించి ఫుల్ బిజీగా మారిపోయింది. చేతినిండా సినిమాలతో త్రిష బిజీగా ఉంది. ఈ క్రమంలోనే తాజాగా త్రిష టీవీ షోలో పాల్గొంది.
అందులో తన లైఫ్, కెరియర్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది. త్రిషకు తెలుగులో బ్రేక్ ఇచ్చిన సినిమా వర్షం. ఈ సినిమా గురించి త్రిష మాట్లాడుతూ.... నేను నా కెరీర్ లో అత్యంత ఎక్కువ ఇబ్బంది పడిన సినిమా వర్షం అని చెప్పింది. ఆ సినిమా కోసం దాదాపు 45 రోజులు పాటు వర్షంలో షూటింగ్ చేశానని త్రిష వెల్లడించింది. దాంతో జ్వరం, జలుబుతో బాగా ఇబ్బంది పడ్డానని త్రిష అన్నారు.
ఒకానొక సమయంలో ఈ సినిమా వదిలేసి వెళ్లిపోవాలని అనుకున్నానని త్రిష చెప్పుకొచ్చింది. కానీ ఈ సినిమా సక్సెస్ అవుతుందని ఆశతో చాలా కష్టపడి నటించానని త్రిష చెప్పింది. ఈ సినిమా ఫలితం చూసినా అనంతరం నేను పడిన కష్టమంతా మరిచిపోయాను అంటూ త్రిష తెలిపింది. వర్షం సినిమా తర్వాత ఇండస్ట్రీలో వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయని దానివల్ల స్టార్ హీరోయిన్ గా మారిపోయానంటూ త్రిష వెల్లడించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.