పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కావాలి అంటూ ఓ స్టార్ హీరోయిన్ బాగా ప్రయత్నిస్తుందట. చాలా అర్జెంట్ అంటూ కూడా పవన్ కళ్యాణ్ ని మీట్ అవ్వడం కోసం అపాయింట్మెంట్ కంపల్సరీ అనే రేంజ్ లో మాట్లాడుతుందట . ఆ హీరోయిన్ మరెవరో కాదు కీర్తి సురేష్. మహానటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కీర్తి సురేష్ ... త్వరలోనే తన బాయ్ ఫ్రెండ్ ఆంటోనీ తట్టిల్ ను పెళ్లి చేసుకోబోతుంది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ని స్పెషల్ గా ఆహ్వానించడానికి ఆయన అపార్ట్మెంట్ కోరారట కీర్తి సురేష్.
ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. పవన్ కళ్యాణ్ - కీర్తి సురేష్ కాంబోలో "అజ్ఞాతవాసి" సినిమా వచ్చింది. అఫ్కోర్స్ ఈ సినిమా డిజాస్టర్ అయినప్పటికీ తెరపై వీళ్ల రొమాన్స్ కి మంచి మార్కులు పడ్డాయి . కీర్తి సురేష్ తో మంచి ఫ్రెండ్షిప్ ని కూడా మైంటైన్ చేస్తూ వచ్చాడు పవన్ కళ్యాణ్ . ఇప్పుడు పవన్ కళ్యాణ్ - కీర్తి సురేష్ పెళ్లికి హాజరవుతాడా..? లేదా..? అన్నది హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. కాగా పవన్ కళ్యాణ్ ఓ పక్క సినిమాలతో మరో పక్క రాజకీయాలతో బిజీ బిజీ గా ఉన్నాడు. కీర్తి సురేష్ తన బాయ్ ఫ్రెండ్ ఆంటోనీ తట్టిల్ ని పెళ్ళి చేసుకోబోతుంది..!