రాజమౌళితో సినిమా అంటే ఎంత టఫ్ సిచ్యువేషన్ ఫేస్ చేయాలి అన్నది ఆయనతో వర్క్ చేసిన నటీనటులకే తెలుస్తుంది . మరి ముఖ్యంగా స్కూల్ కి వెళ్లే పిల్లాడు ఎంత టైమింగ్ ఫాలో అవుతూ స్కూల్ కి వెళ్ళాలో అంతకన్నా పర్ఫెక్ట్ టైమింగ్ ఫాలో అవుతూ రాజమౌళి సినిమా షూట్ కి వెళ్ళాలి. అంత డిస్ప్లేన్ గా ఉండకపోతే రాజమౌళికి కోపం వచ్చేస్తుంది . రాజమౌళీ కోపం భరించడం అంత ఈజీ కాదు. మరి ముఖ్యంగా ఐడికార్డ్స్ వేసుకోవడం పర్ఫెక్ట్ గా టైం కి షూట్ కి రావడం.. ఆయన చెప్పిన డైట్ ని ఫాలో అవ్వడం .. ఆయన చెప్పిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తూచా తప్పకుండా పాటించడం కంపల్సరీ .


అవి తారక్ - రామ్ చరణ్ - ప్రభాస్ ని అడిగితే కచ్చితంగా చెప్పేస్తారు . చాలా ఇంటర్వ్యూలలో ఆ విషయాలను బయటపెట్టాడు. అయితే ఇప్పుడు నిజంగానే మహేష్ బాబుకి పెద్ద సమస్య వచ్చి చేరింది.  మహేష్ బాబు చాలా టైమింగ్ ఫాలో అవుతాడు . కానీ సరిగ్గా రాజమౌళి సినిమాకి కమిట్ అయిన మూమెంట్లోనే ఆయనకి మంచి మంచి సినిమా అవకాశాలు వస్తున్నాయట . అయితే రాజమౌళితో సినిమా కోసం ఆల్రెడీ మూడేళ్ల కాల్ షీట్స్ బుక్ చేసుకున్నారు .



కానీ అందులో ఒక ఏడాది అట్టే గడిచిపోయింది . అసలు షూట్ అన్న పేరు లేకుండానే ఒక సంవత్సరం పాటు లుక్స్ లుక్స్ అంటూ గడిపేసారు రాజమౌళి . ఇక మిగిలింది రెండే నో డౌట్ ఖచ్చితంగా రాజమౌళి దానిని ఇంకా పొడిగిస్తారు . పైగా ఏఐ టెక్నాలజీ కూడా యూస్ చేస్తున్నారు అంటూ వార్తలు రావడంతో ఈ సినిమాపై మరింత హైప్ నెలకొంది . అయితే రాజమౌళికి ఇచ్చిన కాల్ షీట్స్  లో ఆల్రెడీ ఒక ఏడాది గడిచిపోవడంతో మిగిలిన రెండు ఏడాదిలో మరొక ఏడాది అయినా రాజమౌళి మహేష్ బాబు కాల్ షీట్స్ పెంచేసి తీసేసుకుంటారు అంటున్నారు జనాలు . అప్పుడు మహేష్ బాబు మిగతా సినిమాలకు కేటాయించిన కాల్ షీట్స్ కోసం ఇబ్బందులు పడాల్సిందే . ఖచ్చితంగా టఫ్ సిట్యుయేషన్స్ ఫేస్ చేయాల్సిందే అంటూ సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.  దీంతో రాజమౌళితో సినిమా కమిట్ అయిన కొత్త సమస్యలు ఇరుక్కున్నట్టు అయింది మహేష్ బాబు..!

మరింత సమాచారం తెలుసుకోండి: