హీరోయిన్ త్రిష దాదాపు రెండు దశాబ్దాలుగా సౌత్ ఇండస్ట్రీని ఏలేస్తోన్న టాప్ హీరోయిన్. తెలుగు, తమిళం, కన్నడ భాషలలో అనేక హిట్ చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్‏లోనూ దూసుకుపోతుంది. బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంటూ చేతినిండా సినిమాలతో కుర్ర హీరోయిన్లకు సైతం చెమటలు పట్టిస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ తమిళంలో హీరో అజిత్ జోడిగా ఇటు తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సినిమాలో నటిస్తుంది. అలాగే టాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు అందుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఓ టీవీ షోలో పాల్గొన్న త్రిష తన కెరీర్, లైఫ్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. కెరీర్ తొలినాళ్లల్లో ఓ స్టార్ హీరో సినిమాను మధ్యలోనే వదిలేసి వెళ్లిపోవాలనుకుందట. అందుకు కారణాన్ని వెల్లడించింది.త్రిషకు తెలుగులో బ్రేక్ ఇచ్చిన సినిమా వర్షం. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, త్రిష జంటగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఈ సినిమాతో తెలుగులో టాప్ హీరోయిన్ అయిపోయింది. తన కెరీర్ లోనే ఆ సినిమా తనకు చాలా స్పెషల్ అంటుంది త్రిష. 

అయితే తాజాగా ఓ టీవీ షోలో త్రిష మాట్లాడుతూ.. తన కెరీర్ లో అత్యంత ఎక్కువ ఇబ్బంది పడ్డ సినిమా అదే అని చెప్పింది. త్రిష కెరీర్ ఆరంభంలో వర్షం సినిమా కోసం ఎంతో కష్టపడిందని అదే షోలో పాల్గొన్న త్రిష తల్లి తెలిపింది. ఈ సినిమా కోసం దాదాపు 45 రోజులు వర్షంలో షూటింగ్ చేశారని దీంతో జలుబు, జ్వరంతో త్రిష బాగా ఇబ్బంది పడిందని ఒక దశలో సినిమా వదిలేసి వెళ్లిపోవాలనుకుందని చెప్పుకొచ్చింది. ఐతే చివరకు సినిమా ఫలితం చూశాక పడ్డ కష్టం అంతా మర్చిపోయిందని తెలిపింది. తన తల్లి చెప్పిన మాటలు వందశాతం నిజమని త్రిష వెల్లడించింది.వర్షం సినిమా అటు త్రిషకు ఇటు ప్రభాస్ కు స్టార్ డమ్ తెచ్చిపెట్టింది. ఈ చిత్రాన్ని దివంగత డైరెక్టర్ శోభన్ తెరకెక్కించగా టాలీవుడ్ హీరో గోపిచంద్ విలన్ గా నటించారు. ఈ సినిమాలోని సాంగ్స్ అన్ని సూపర్ హిట్ అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: