ఈ క్రమంలోనే పుష్ప 2 సినిమా అని అడ్డుకుంటాం ఫ్లాప్ చేస్తామంటూ ఓపెన్ గానే సవాళ్లు విసురుతున్నారు మెగా ఫాన్స్ . దానికి కౌంటర్గా బన్నీ ఫాన్స్ కూడా బాగానే ధీటుగా బెదిరిస్తున్నారు. అయితే ఇప్పుడు బన్నీ ఫాన్స్ మరొక విధంగా మెగా ఫాన్స్ మాటల తో కొట్టుకోవడం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే మరో స్టార్ హీరోకి బాగా కలిసి వచ్చేలా ఉంది అంటున్నారు జనాలు. ఆయనే వెంకటేష్ . విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది .
అదే టైంలో మెగా స్టార్ చిరంజీవి నటించిన విశ్వంభర సినిమా కూడా రిలీజ్ కాబోతుంది . దానికి ముందే గేమ్ చేంజర్ సినిమా కూడా రిలీజ్ కాబోతుంది . అయితే పుష్ప 2 సినిమాని అడ్డుకుంటామంటూ కొందరు ఫ్యాన్స్ ఎలా బన్నీ ఫ్యాన్స్ ని రెచ్చకొడుతున్నారో చూస్తున్నాం. మెగా ఫాన్స్ ఓపెన్గా సవాల్ విసురుతూ ఉండడంతో బన్నీ ఫాన్స్ కూడా గేమ్ చేంజర్ సినిమా ఫ్లాప్ చేస్తామంటూ ఓపెన్ సవాల్ విసిరుతున్నారు. ఇప్పుడు మెగా వర్సెస్ అల్లు వార్ లో లాభం పొందేలా వెంకటేష్ కనిపిస్తున్నాడు . వెంకటేష్ "సంక్రాంతికి వస్తున్నాం" సినిమాకి భారీ కాంపిటీషన్ అంటే గేమ్ చేంజర్ -విశ్వంభర. ఈ రెండు సినిమాలు నిజంగా ఫ్లాప్ టాక్ దక్కించుకునేలా చేస్తే కచ్చితంగా సంక్రాంతి హీరో అవుతాడు వెంకటేష్ . అఫ్కోర్స్ సంక్రాంతి సెంటిమెంట్ వెంకటేష్ కి ఎక్కువగానే ఉంది . చాలా సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు ఇదే విషయం కారణంగా సోషల్ మీడియాలో వెంకటేష్ ని ఓ రేంజ్ లో ట్రెండ్ చేసేస్తున్నారు అభిమానులు..!