తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటి మనలలో పవిత్ర లోకేష్ ఒకరు. ఈ ముద్దు గుమ్మ చాలా సంవత్సరాల నుండి అనేక తెలుగు సినిమాలలో నటిస్తూ వస్తుంది. అందులో భాగంగా ఈమె నటించిన కొన్ని సినిమాలు మంచి విజయాలను సాధించడం , అందులో చాలా సినిమాలలో తన అద్భుతమైన నటనతో ఈ నటి ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈమెకు ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు ఉంది. ఇకపోతే తెలుగు సినీ పరిశ్రమలో నటిగా మంచి జోష్ లో కెరీర్ ను ముందుకు సాగిస్తున్న సమయం లోనే ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న నటుడు అయినటువంటి నరేష్ ను ప్రేమించింది.

ఇక అప్పటికే నరేష్ మూడు వివాహాలను చేసుకున్నాడు. కానీ ముగ్గురి తో విడాకులు తీసుకున్నాడు. దానితో నరేష్ , పవిత్ర ప్రస్తుతం కలిసి జీవితాన్ని ముందుకు సాగిస్తున్నారు. నరేష్ ప్రస్తుతం తన సినిమాలతో ఫుల్ బిజీగా కెరియర్ ను ముందుకు సాగిస్తూ ఉంటే , పవిత్ర కూడా వరుస సినిమాలతో బిజీగా కెరియర్ను కొనసాగిస్తుంది. ఇకపోతే పవిత్ర లోకేష్ సినిమాల ద్వారా పెద్ద మొత్తం లోనే ఆస్తులను కూడబెట్టినట్లు తెలుస్తోంది.

చాలా సంవత్సరాల నుండి సినిమాలలో నటిస్తూ ఉండడంతో ఇప్పటికే దాదాపు 70 కోట్ల మేర ఆస్తులను సంపాదించినట్లు తెలుస్తోంది. ఈమెకు బెంగళూరులో ఒక అపార్ట్మెంట్ తో పాటు పలు చోట్ల స్థలాలు కూడా ఉన్నాయి అని తెలుస్తుంది. అలాగే హైదరాబాదులో కూడా ఒక సంత ఇంటిని కూడా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇలా పవిత్ర లోకేష్ చాలా సంవత్సరాల నుండి సినిమాలలో నటించి పెద్ద మొత్తం లోనే ఆస్తులను కూడా పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కూడా పవిత్ర లోకేష్ అనేక సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ గా కెరియర్ ను ముందుకు సాగిస్తున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: