ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప పార్ట్ 2 అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్గా నటించింది. ఈ సినిమా యొక్క మొదటి భాగం అద్భుతమైన విజయం సాధించడంతో ఈ మూవీ రెండవ భాగంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇకపోతే పుష్ప పార్టీ 2 సినిమా విడుదల తేదీ దగ్గర పడడం తో ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం అనేక ప్రచార చిత్రాలను , పాటలను విడుదల చేసింది. వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో నిన్న రాత్రి ఈ మూవీ బృందం ఓ భారీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేసింది.

సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ డైరెక్టర్లలో ఒకరు అయినటువంటి ఎస్ ఎస్ రాజమౌళి ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఇది ఇలా ఉంటే ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో భాగంగా రాజమౌళి మాట్లాడుతూ ... ఈ సినిమా షూటింగ్ స్పాట్ కి ఒక రోజు వెళ్లాను. అక్కడ సుకుమార్ నాకు ఈ సినిమాలోని అల్లు అర్జున్ ఇంట్రడక్షన్ సీన్ ను చూపించాడు. అది అద్భుతంగా వచ్చింది. దానితో నేను సుకుమార్ తో దీనికి దేవి శ్రీ ప్రసాద్ తో రేంజ్ లో బ్యాగ్రౌండ్స్ స్కోర్ కొట్టిస్తావా కొట్టించు ... ఆ సన్నివేశం మరింత హైలెట్ అవుతుంది అని అన్నాను అని రాజమౌళిసినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా అన్నాడు. ఇక సుకుమార్సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో భాగంగా మాట్లాడుతూ ... ఈ మూవీ క్లైమాక్స్ కి దేవి శ్రీ ప్రసాద్ అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు అని అన్నాడు. ఇకపోతే వీరిద్దరూ కూడా పుష్ప పార్ట్ 2 ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో భాగంగా దేవి శ్రీ ప్రసాద్ బ్యాగ్రౌండ్ స్కోర్ గురించి మాట్లాడారు.

గత కొంత కాలంగా పుష్ప పార్ట్ 2 సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో మేకర్స్ అసంతృప్తిగా ఉన్నట్లు , దానితో వేరే సంగీత దర్శకులతో ఈ మూవీ బృందం వారు ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వర్క్ చేయించుకుంటున్నట్లు అనేక వార్తలు వచ్చాయి. దానితో ఆ విషయాన్ని ఎవరు పట్టించుకోకూడదు అనే ఉద్దేశంతోనే వీరిద్దరు కూడా దేవి శ్రీ ప్రసాద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి ఇన్ డైరెక్ట్ గా మాట్లాడారు అనే వాదనను కొంత మంది వినిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: