గంధపు చెక్కల స్మగ్లింగ్ అనే కాన్సెప్ట్ తో సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్పా సినిమా ఎంత భారీ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఈ సినిమాకు సీక్వల్ గా ప్రస్తుతం పుష్ప-2 అనే సినిమా తెరకెక్కింది. ఇక ఎన్నోసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ మూవీ ఇక ఇప్పుడు డిసెంబర్ 5వ తేదీన అంటే మరో రెండు రోజుల్లో థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఇక ఈ సినిమాపై భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే.
అయితే పుష్ప 2 మాత్రమే కాదు మరో పార్ట్ కూడా ఉండబోతుంది అని ఒక టాక్ గత కొన్ని రోజుల నుండి ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. ఇక ఇది నిజమే అన్న విషయం ఇప్పుడు లీక్ అయిపోయింది. ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారమే పుష్ప-3 కూడా ఉండనుంది అని ఇక ఇప్పుడు అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది. పుష్ప-2 మరో రెండు రోజుల్లో విడుదల కానుండగా టైటిల్ ఎండ్ కార్డు లో పుష్ప-3 టైటిల్ రివిల్ చేయబోతున్నారు అన్నది తెలుస్తుంది. ఇటీవల ఎడిటింగ్ రూమ్లో దిగిన ఫోటోని చిత్ర యూనిట్ షేర్ చేయగా అందులో వెనకాల స్క్రీన్ పై పుష్ప-3 ది ర్యాంపేజ్ అని రాసి ఉన్న పోస్టర్ కనిపిస్తుంది. దీంతో పార్ట్ 3 టైటిల్ ఇదే అంటూఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది ఈ విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.