స్టార్ హీరో సినిమా విడుదలవుతుంది అంటే బాక్స్ ఆఫీస్ వద్ద ఉండే హడావిడి అంతా కాదు. కానీ ఇలా స్టార్ హీరో సినిమా విడుదల అవుతున్నప్పుడు మధ్యతరగతి ప్రేక్షకులు మాత్రం కాస్త బాధ పడిపోతున్నారు. భారీగా పెరిగిపోయిన టికెట్ రేట్ లు చూసి ఇక ఫ్యామిలీతో కనీసం ఒక్క సినిమా అయినా చూడగలమా అనే భావన ప్రతి ఒక్కరికి కలుగుతుంది. ఇటీవల కాలంలో ఏకంగా ఒక్క ఫ్యామిలీ సినిమాకు వెళ్ళింది అంటే 2000 నుంచి 3000 రూపాయలు ఖర్చు చేయాల్సిందే.
ఇక ఇలా టికెట్ల రేట్లు పెంచి సామాన్యుల జోబుకి చిల్లు పెట్టడం కారణంగానే పైరసీ వైపు ఎంతో మంది ప్రేక్షకులు అడుగులు వేస్తున్నారు అనే వాదన కూడా అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటుంది. అయితే ఇలా టికెట్ రేట్లు పెరగడానికి చాలానే కారణాలు ఉన్నాయి. ఒకప్పుడు థియేటర్లో ఫ్యాన్ సౌండ్ అరుపులు బరిస్తూ సినిమా చూసేవాళ్ళు ప్రేక్షకులు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. సెంట్రల్ ఏసీలు ప్రీమియం సీటింగ్ వంటి లగ్జరీ సౌకర్యాలు కోరుకుంటున్నారు. ఇక థియేటర్ యాజమాన్యాలు కూడా ఇలాంటి సౌకర్యాలు పెట్టడంతో టికెట్ ధరలు పెరిగిపోతున్నాయి. అంతేకాదు పాన్ ఇండియా మూవీలకు అసలు బడ్జెట్ కంటే అదనంగా ఖర్చు చేస్తున్నారు నిర్మాతలు. ఇక లాభాలు కోసం తప్పనిసరి పరిస్థితుల్లో టికెట్ రేట్లు పెంచేస్తున్నారు. ఇంకోవైపు హీరో హీరోయిన్ల రెమ్యూనరేషన్లు, సినిమాల కోసం కోట్లు ఖర్చుపెట్టి వేసే భారీ సెట్లు, వీఎఫ్ ఎక్స్, లొకేషన్ లు ఇలా సినిమా బడ్జెట్ను పెంచేస్తున్నాయి. ఇక ఇలాంటి కారణాలన్నీ కూడా సినిమా టికెట్ రేట్ లు పెరిగిపోవడానికి కారణం అవుతున్నాయి అని చెప్పాలి.