అయితే అప్పట్లో స్టార్ హీరోగా ఒక హవా నడిపించిన టాలీవుడ్ సోగ్గాడు శోభన్ బాబుకు ఇలాంటి చేదు అనుభవం ఎదురయిందట. సాధారణంగా శోభన్ బాబు అంటేనే హుందాతనం క్రమశిక్షణకు మారుపేరు అని అంటూ ఉంటారు. అలాంటి స్టార్ హీరోని పట్టుకుని ఒక నిర్మాత కొట్టాడట. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చిన శోభన్ బాబు స్టార్ హీరోగా ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. టాలీవుడ్ లవర్ బాయ్ గా.. ఇక ఎంతోమంది అమ్మాయిల సోగ్గాడిగా పేరు సంపాదించుకున్నారు.
అలాంటి శోభన్ బాబును కొట్టిన నిర్మాత ఎవరో కాదు కాట్రగడ్డ మురారి. ఈయన ఎప్పుడో 40 ఏళ్ల క్రితం సినిమాలు చేశారు. అయితే హీరో ఎవరైనా దర్శకుడు ఎవరైనా తనకు నచ్చినట్టు సినిమా తీయాలనేదే ఆయన చెప్పేవారట. అందుకే ఇండస్ట్రీలో ఎక్కువ కాలం ఇమడ లేకపోయారు అయితే కే విశ్వనాధ్ దర్శకత్వంలో వచ్చిన సీత మహాలక్ష్మి సినిమాకి ఈయన నిర్మాతగా వ్యవహరించారు. శోభన్ బాబుతో గోరింటాకు మూవీ ని కూడా నిర్మించారు. ఈ సినిమాకు దాసరి దర్శకుడు. అయితే ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో శోభ బాబు చేసిన ఒక పనికి నిర్మాత కాట్రగడ్డ శోభన్ బాబుని కొట్టాల్సి వచ్చిందట. గోదావరి ఒడ్డున ఒక సాంగ్ షూటింగ్ జరుగుతున్న సమయంలో శోభన్ బాబు పదేపదే చేతులు పైకెత్తుతున్నాడట. పాటకి డాన్స్ చేస్తూ అలాంటి మూమెంట్స్ ఇస్తున్నారు. వద్దు అని చెప్పిన పదేపదే అలాగే చేస్తున్నాడట. ఇక ఇది కాసేపు గమనించిన నిర్మాత శోభన్ బాబు దగ్గరికి వచ్చిన తర్వాత చేతిలో ఏది ఉంటే అది విసిరేసాడట. దీంతో అందరూ షాక్ అయ్యారట. అయితే వాళ్ళిద్దరి మధ్య ఏరా అనుకునేంత స్నేహబంధం ఉందని ఆ స్నేహబంధం తోనే కొట్టినట్లు ఒకనొక ఇంటర్వ్యూలో కాట్రగడ్డ మురారి చెప్పుకొచ్చారు.