ప్రతి ఒక్కరి నోటిలో పుష్పరాజ్ పేరు మాత్రమే వినపడుతోంది. అల్లు అర్జున్ నటించిన పుష్ప2 సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న వేళ వచ్చేసింది. కేవలం రెండు రోజులలో ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లను ఘనంగా నిర్వహించారు. నిన్న హైదరాబాదులో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు సినీ ప్రముఖులు, తరలివచ్చారు. ముఖ్యంగా రాజమౌళి, అల్లు అరవింద్ పాల్గొనడం విశేషం. ఈవెంట్ లో సుకుమార్, అల్లు అర్జున్ ను ప్రశంసిస్తూ అందరూ మాట్లాడారు.

అల్లు అర్జున్ నటన అద్భుతంగా ఉందని కొనియాడారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ ఈ సినిమా చూశానని చాలా అద్భుతంగా ఉందని చెప్పారు. రష్మిక మందన అద్భుతంగా నటించిందని చెప్పాడు. శ్రీలీల కనిపించింది తక్కువ సమయమే అయినప్పటికీ మంచి గుర్తింపు సంపాదించుకుంటుందని చెప్పాడు. అనంతరం దేవి శ్రీ ప్రసాద్, శ్రీ లీల, రష్మిక మందన, సుకుమార్ మాట్లాడారు.

ఇక చివరిగా అల్లు అర్జున్ మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయ్యాడు. చాలా కష్టపడి ఈ సినిమాల్లో నటించానని ఈ సినిమా ప్రేక్షకులకు అంకితం అంటూ అల్లు అర్జున్ అన్నారు. రష్మిక మందన నటనను మెచ్చుకున్నాడు. ఇలాంటి అమ్మాయే కదా ఇండస్ట్రీకి కావాలి అని రష్మికను మెచ్చుకున్నాడు. ఇక ఫైనల్ గా పుష్ప అంటే ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అనే డైలాగును చెప్పాడు. దీంతో ఒక్కసారిగా అభిమానులు పెద్ద ఎత్తున కేకలు వేశారు.

ఈ డైలాగుని ఒక్కసారి కాదు ఏకంగా రెండు సార్లు చెప్పాడు. దీంతో అల్లు అర్జున్ ఈ డైలాగ్ ను మెగా హీరోలను ఉద్దేశించి రెండుసార్లు చెప్పాడని కొంతమంది సోషల్ మీడియాలో ఈ డైలాగ్ ను వైరల్ చేస్తున్నారు. మెగా వర్సెస్ అల్లు కుటుంబాల మధ్య గొడవలు ఉన్నాయని ఎన్నో రోజుల నుంచి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ కారణంగానే అల్లు అర్జున్ మెగా హీరోలను ఉద్దేశించి ఇలా డైలాగులు చెప్పాడని అంటున్నారు. మరి ఈ వార్తలో ఏ మేరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: