ఈ క్రమంలోనె ఈ పెళ్లికి సంబంధించి ఏ విషయం తెరమీదకి వచ్చినా కూడా అది సోషల్ మీడియాలో తెగ హాట్ టాపిక్ గా మారిపోతుంది. ఎందుకంటే గతంలో నాగచైతన్య హీరోయిన్ సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇక టాలీవుడ్ లోనే మోస్ట్ క్యూట్ కపుల్ గా పేరు సంపాదించుకున్న ఈ జంట విడాకులు తీసుకుని వేరుపడ్డారు. ఇప్పటికీ వీరిద్దరు ఎందుకు విడిపోయారు అన్నది ఒక ప్రశ్న గానే మిగిలిపోయింది అన్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో ఇప్పుడు శోభితాను పెళ్లి చేసుకునేందుకు నాగచైతన్య రెడీ అయ్యాడు. దీంతో ఇక వీరిద్దరికి సంబంధించి ఏ విషయం తెరమీదకి వచ్చినా తెలుసుకునేందుకు ఇంటర్నెట్ జనాలు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
అయితే సమంత గతంలో నాగచైతన్యతో పెళ్లి అయిన తర్వాత కూడా సినిమాల్లో నటించింది. మరి ఇప్పుడు నాగచైతన్యకు రెండో భార్యగా రాబోతున్న శోభిత పెళ్లి తర్వాత సినిమాలో నటిస్తుందా లేదా అన్న విషయంపై కూడా అందరి మనసులో ఒక ప్రశ్న ఉంది. అయితే ఇదే విషయంపై ఇటీవల నాగచైతన్యకు ఒక ప్రశ్న ఎదురైంది. పెళ్లి తర్వాత శోభిత సినిమాలో నటిస్తారా అన్న విషయంపై నాగ చైతన్య క్లారిటీ ఇచ్చారు. ఆమె కచ్చితంగా నటిస్తుంది అంటూ వెల్లడించారు. ప్రతి తెలుగింటి లాగే శోభిత కుటుంబం కూడా చాలా సంస్కారం ఆప్యాయతతో కూడుకున్నది. వాళ్ళ ఫ్యామిలీ నన్ను కొడుకుల చూసుకుంటారు నాగచైతన్య చెప్పుకొచ్చాడు.