అయితే కేవలం సెలబ్రిటీలు మాత్రమే కాదండోయ్ సెలబ్రిటీ కుటుంబ సభ్యులకు సంబంధించిన విషయాలు కూడా అప్పుడప్పుడు హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఇలాంటి విషయమే ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మామూలుగా అయితే సినీ సెలబ్రిటీల ప్రేమాయణాలు బ్రేకప్ చెప్పుకొని మరొకరితో లవ్ కొనసాగించడం సర్వసాధారణం గా చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ మాత్రం ఘటన మరోలా జరిగింది. ఏకంగా ఒక హీరోయిన్ చెల్లెలు ఒక హత్య చేసింది. అది కూడా ఎవరినో కాదు లవ్ బ్రేకప్ చెప్పిన ప్రియుడిని దారుణంగా హత్య చేసేసింది.
ఈ విషయం కాస్త ప్రస్తుతం ఇంటర్నెట్లో సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి. రాక్ స్టార్ మూవీ నటి అయిన నర్గీస్ ఫక్రి సిస్టర్ అలియా ఫక్రి (43)ని న్యూయార్క్ పోలీసులు అరెస్టు చేశారు. మాజీ ప్రియుడు జాకబ్ (35) అతని స్నేహితుడు ఎటిని (33) ఉంటున్న గ్యారేజ్ని ఇటీవలే ఆలియా ఫక్రి తగలబెట్టేసారు. ఇక ఈ ఘటనలో ఏకంగా హీరోయిన్ చెల్లెలి మాజీ ప్రియుడు అతని స్నేహితుడు కూడా సజీవ దహనం అయిపోయారు. అయితే ఏడాది క్రితం ఆలియా పక్రి ప్రియుడు బ్రేకప్ చెప్పినప్పటికీ ఆమె యాక్సెప్ట్ చేయలేదట. ఇక ఇటీవల కోపంతో రగిలిపోయిన ఆమె మీరిద్దరూ నా చేతుల్లో చచ్చారు అంటూ ఏకంగా గ్యారేజ్ కి నిప్పుంటించడంతో ఇద్దరు సజీవ దహనం అయిపోయారు.ఈ క్రమంలోనే ఆమెను న్యూయార్క్ పోలీసులు అరెస్టు చేశారు.