బుల్లితెరపై బిగ్గెస్ట్ రియాలిటీ షో గా కొనసాగుతున్న బిగ్ బాస్ కార్యక్రమంలో లవ్ ట్రాక్ లు అనేవి చాలా కామన్  కొంతమంది స్ట్రాటజీ ప్రకారం లవ్ ట్రాక్లు నడిపితే ఇంకొంతమంది మనస్ఫూర్తిగానే లవ్ లో మునిగి తేలుతూ ఉంటారు. అయితే బిగ్బాస్ ఎనిమిదవ సీజన్లో మాత్రం విచిత్రమైన లవ్ ట్రాక్ నడిచింది  ఎప్పుడు మెయిల్ కంటెస్టెంట్స్ అమ్మాయిల వెంటపడితే ఇక ఈ సీజన్లో మాత్రం బాగా పాపులారిటీ ఉన్న విష్ణు ప్రియ మేయిల్ కంటెస్టెంట్ అయిన పృథ్వీరాజ్ వెంటపడింది. నాకు నాకంటే నువ్వే ఎక్కువ అంటూ ప్రేమను కురిపించింది.


 అతను మాత్రం ఏమీ పట్టించుకోనట్లుగానే క్యాజువల్ గా ఉన్నాడు  కానీ అతను ఏం మాట్లాడిన గింగిరాలు తిరుగుతూ వచ్చింది విష్ణు ప్రియ. దీంతో ఆమెది స్ట్రాటజీనా లేకపోతే నిజమైన ప్రేమ అన్న విషయం ప్రేక్షకులకు కూడా అర్థం కాలేదు. అయితే బిగ్ బాస్ ఫ్యామిలీ వీక్ లో నాగ పంచమి సీరియల్ నటి దర్శిని గౌడ స్టేజ్ పైకి వచ్చింది  ఆమె మాటలు చూసిన ప్రేక్షకులు పృథ్వీరాజ్, దర్శిని  కూడా ప్రేమించుకుంటున్నారా అనే డౌట్ లో పడిపోయారు  ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి బయటికి వచ్చిన పృధ్విరాజ్  ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు.


 దర్శిని నాతో కలిసి నటించింది. ఆమె గొప్ప నటి కూడా. తను నాకు మంచి ఫ్రెండ్ కూడా. సీరియల్స్ లో మంచి కెమిస్ట్రీ ఉంది. కాబట్టి ఆ సమయంలో మేమిద్దరం లవ్ లో ఉన్నాము అని అందరూ అనుకున్నారు.  కానీ తను నాకు మంచి స్నేహితురాలు మాత్రమే అంటూ క్లారిటీ ఇచ్చాడు. ఇక పెళ్లి గురించి కూడా ప్రస్తావిస్తూ పెళ్లి కంటే ముందే నాకంటూ కొన్ని లక్ష్యాలు ఉన్నాయి. కెరీర్ పై ఫోకస్ పెట్టాను. నేను అనుకున్న దాంట్లో ఇంకా 10% కూడా చేయలేదు. అబ్బాయిలకు ఫస్ట్ లైఫ్ లో సెటిల్ అవ్వాలి కదా. సమయం వచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటాను. అది కూడా లవ్ మ్యారేజే అంటూ పృథ్వీరాజ్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: