ఇండియన్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఇప్పుడు రఫ్ ఆడిస్తున్నాయి .. ప్రపంచ బాక్సాఫీస్ ను షేక్‌ చేస్తూ సింపుల్గా వేలకోట్ల కలెక్షన్లు సంపాదిస్తున్నాయి .. బాహుబలి , త్రిబుల్ ఆర్ వంటి సినిమాలు 1000 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి సంచ‌ల‌న‌ రికార్డులు సృష్టించాయి . అయితే ఇవి హైయెస్ట్ గ్రాసర్స్‌గా  నిలిచాయి కానీ మొత్తం మూవీ బడ్జెట్ను మొదటి రోజే వసూలు చేయలేకపోయాయి .. కానీ ఒక సినిమా మాత్రం తొలిరోజే ఓపెనింగ్ కలెక్షన్ లోనే బడ్జెట్ మొత్తం రికవరీ చేసింది .. ఈ అరుదైన రికార్డు ఒక సౌత్ ఇండియన్ సినిమా పేరుతో ఉంది .. ఇంతకీ ఆ సినిమా మరేదో కాదు కే జి ఎఫ్ చాప్టర్ 2 ..


కేజిఎఫ్ చాప్టర్ 2 కోసం చిత్ర యూనిట్‌ 100 కోట్ల వరకు బడ్జెట్ట్ పట్టింది .. అయితే ఈ సినిమా తొలిరోజే 164 కోట్ల కలెక్షన్లు రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది .. ఇంత తక్కువ సమయంలోనే మొత్తం బడ్జెట్ ఖర్చును వసూలు చేసిన ఏకైక భారతీయ సినిమాగా హిస్టరీ క్రియేట్ చేసింది . ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కన్నడ చిత్ర పరిశ్రమలో ఎన్నో బాక్సాఫీస్ రికార్డులు కొల్లగొట్టింది .. ఆ ఇండస్ట్రీలో తీసిన మోస్ట్ ఎక్స్పెన్సివ్ సినిమా కూడా ఇదే ప్రపంచ వ్యాప్తంగా 1000 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి భారతీయ సినిమా చరిత్రలో అత్యధిక కలెక్షన్ సాధించిన నాలుగో సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది.



కేజీఎఫ్-2 లో యష్ రాకీ పాత్రలో నటించాడు. కొలార్‌ గనుల్లో బంగారం కోసం జరిగే పోరాటంలో రాకీ టాప్ రేంజ్‌కి ఎలా ఎదిగాడనేది ఈ సినిమా చూపిస్తుంది. సంజయ్ దత్ ఈ అధీరా అనే విలన్ పాత్రలో నటించగా, రవీనా టాండన్ 1980లలో భారతదేశ ప్రధానమంత్రి రమిక సేన్‌గా నటించింది. శ్రీనిధి శెట్టి రాకీ లవర్ రీనా దేశాయ్‌గా కనిపించింది. బెస్ట్ ఎలివేషన్స్, హైవోల్టేజ్ యాక్షన్ సీన్లు, ఆకట్టుకునే కథ, నటీనటుల అద్భుతమైన నటన కారణంగా ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: