పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే దాకా కనీసం ఒక్కసారైనానా తలుచుకోకుండా ఉండలేని పేరు ఓజి ..  సుజిత్ దర్శకత్వంలో డివివి ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ గ్యాంగ్ స్టార్ డ్రామా మీద ఎన్నో అంచనాలు ఉన్నాయి ..  ముందు రిలీజయ్యేది హరిహర వీరమల్లే అయినా  అభిమానులు మాత్రం ఓజీనే కోరుకుంటున్నారు .. త్వరలోనే మిగిలిన షూటింగ్ కి ఏర్పాట్లు చేస్తున్నారు చిత్ర యూనిట్ .. జనవరి లేదా ఫిబ్రవరిలో ఈ సినిమా షూటింగ్ ముగించేందుకు ఏర్పాటు చేస్తున్నారు ... ఇక ఇందులో ఒక కీలకమైన క్యామియో గురించి గత రెండు మూడు రోజులుగా ఎన్నో వార్తలు బయటకు వస్తున్నాయి ..


ప్రభాస్ అని ఒకరు , నాని అని మరొకరు ఇలా ఏదో ఒక వార్త బయటకు వస్తూనే ఉంది .. కానీ ఇక్కడ అసలు ట్విస్ట్ ఏమిటంటే ఈ పాత్ర చేయబోయేది ఈ ఇద్దరు కాదట .. బాబాయ్ అబ్బాయ్ మొదటిసారి కలయికని  సాధ్యం చేస్తూ దర్శకుడు సుజిత్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ని ఒప్పించినట్లు లేటెస్ట్ అప్డేట్ .. గత కొన్ని నెలల క్రితమే దీనికి సంబంధించిన చర్చ జరిగిందని .. తక్కువ కాల్ షీట్ కాబట్టి అవసరమైనప్పుడు అడిగితే ఇస్తానని చరణ్ హామీ ఇచ్చారట .. ఇక దానికి అనుగుణంగానే త్వరలోనే చరణ్ కు సంబంధించిన షూట్ కంప్లీట్ చేయొచ్చని అంటున్నారు .. అయితే దీనిపై ఇంకా అధికార ప్ర‌క‌ట‌న రాలేదు కానీ ఇన్సైడ్ టాక్‌ మాత్రం ఇదే ..


ఇక ఇదే గనక నిజమైతే మాత్రం ధియేటర్లు బ్లాస్ట్ అవ్వటం ఖాయం .. ఓజితో పవన్ కళ్యాణ్ హీరోయిజంకి కొన్ని నిమిషాలైనా చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్  తోడైతే రోలెక్స్ రేంజ్ లో ఆ ఎపిసోడ్ కు పూనకాలు వస్తాయి .. ఇక 2025 లో ఈ సినిమాని ఎప్పుడు రిలీజ్ చేయాలని నిర్ణయం ఇంకా తీసుకోలేదని కానీ పోస్ట్ ప్రొడక్షన్ కు ఎక్కువ సమయం పెట్టేలా ఉంది .. క్వాలిటీ విషయంలో సుజిత్ రాజీ పడకుండా ఈ సినిమాను చూసుకుంటున్నాడు. ఇక ఈ సంక్రాంతికి టీజర్ లేదా పాట‌ రూపంలో ఏదైనా కీలక అప్డేట్ ఇచ్చే అవకాశం ఉందని కూడా అంటున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: