తెలుగు తెరపై తమదైన ముద్రవేసిన అలనాటి కథానాయికలలో ప్రభ ఒకరు. 1970లలో తెనాలి నుంచి వెళ్లి తెలుగు సినిమాను ఏలినవారిలో ఆమె ఒకరు. ఎన్టీఆర్ శతజయంతి అవార్డును మొదటిసారిగా అందుకున్నది ఆమెనే. తాజా ఇంటర్వ్యూలో ప్రభ మాట్లాడుతూ, అనేక విషయాలను గురించి ప్రస్తావించారు.చదువుకునే రోజుల నుంచి నాకు ఎన్టీఆర్ గారి పౌరాణికాలు .. ఏఎన్నార్ గారి సాంఘికాలు అంటే చాలా ఇష్టం. అలాంటి నేను 'నీడలేని ఆడది' సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యాను. ఇక ఎన్టీఆర్ తో నేను చేసిన ఫస్టు మూవీ 'దాన వీర శూర కర్ణ'. అప్పటివరకూ ఆయనను నేను కలవలేదు. రామకృష్ణ సినీ స్టూడియోస్ ఓపెనింగ్ హీరోయిన్ నేనే. సెట్లో ఆయనను చూడగానే నాకు నోట మాట రాలేదు అని అన్నారు.ఈ సినిమా షూటింగ్ 'చిత్రం భళారే విచిత్రం' సాంగ్ తో మొదలైంది. కెమెరా ముందుకు వెళ్లగానే ఎన్టీఆర్ గారి భారీ విగ్రహం చూసి భయం వేసింది. మా గురువు గారు నాకు ధైర్యం చెప్పారు. ఎన్టీఆర్ గారితో హీరోయిన్ గా 100 సినిమాలు చేస్తే ఎంత పాప్యులారిటీ వస్తుందో, ఆ ఒక్క పాటతో నాకు అంత పాప్యులారిటీ వచ్చింది. దుర్యోధనుడు అనే ఒక నెగెటివ్ క్యారెక్టర్ ను పాజిటివ్ గా మార్చిన గొప్పతనం ఎన్టీఆర్ గారి సొంతం అని చెప్పుకొచ్చారు.

ఈ క్రమంలో నే ఎన్టీఆర్ దర్శకత్వం వహించి త్రిపాత్రాభినయం చేసిన దానవీర శూర కర్ణ చిత్రాన్ని ఆమె గుర్తు చేసుకుంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక వైపు నటిస్తూ మరోవైపు దర్శకత్వం చేయడం అలాంటి చిత్రానికి చాలా కష్టం. అందరికన్నా ఎక్కువ కాస్ట్యూమ్స్ ఎన్టీఆర్ గారికే ఉండేది. మూడు పాత్రల్లో నటించాలి. మేకప్ కి కొన్ని గంటలు పట్టేది.మేము ఉదయం 7 గంటలకు వెళ్లి మేకప్ కాస్ట్యూమ్స్ వేసుకుంటే మధ్యాహ్నం 1 గంటవరకు తీయడానికి లేదు. కనీసం వాష్ రూమ్ కి వెళ్ళడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే మేకప్ పాడై పోతుంది. మేకప్ అసిస్టెంట్ వచ్చి మేడం నీళ్లు ఎక్కువగా తాగకండి అని చెప్పేవారు. ఎన్టీఆర్ గారు అయితే మేకప్ వేసుకుని కదలకుండా అలాగే కూర్చుండిపోయేవారు.ఆయన దుర్యోధనుడి గెటప్ లో ఉన్నప్పుడు ఛాతీ విరుచుకుని నడుస్తూ ఆ రౌద్రం ప్రదర్శించేవారు. మళ్ళీ కృష్ణుడి గెటప్ వేయగానే సరళంగా సౌమ్యంగా మారిపోయేవారు. అప్పటి వరకు ఉన్న బాడీ లాంగ్వేజ్ పూర్తిగా మారిపోయేది. ఈయనకి నిజంగానే దేవుడు పూనాడా అని ఆశ్చర్యపోయేవాళ్ళం అంటూ ప్రభాస్ వ్యాఖ్యలు చేశారు.అలా మూడు పాత్రల్లో వేరియషన్స్ చూపిస్తూ, దర్శకత్వం చేస్తూ, కేజీల కేజీల మేకప్, కాస్ట్యూమ్స్ భరిస్తూ నటించడం ఆయనకి మాత్రమే చెల్లింది. ఎన్టీఆర్ గారు నిజంగా కారణజన్ముడు అని ప్రభ ప్రశంసలు కురిపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: