ఆలస్యంగా బుకింగ్స్ ఓపెన్ కావడం కూడా ఇందుకు కారణమని చెప్పవచ్చు. బెనిఫిట్ షోలకు సైతం వందల సంఖ్యలో టికెట్లు అందుబాటులో ఉండటం ఇందుకు కారణమని చెప్పడంలో సందేహం అవసరం లేదు. అదే సమయంలో టికెట్లు మొదట జొమాటోకు సంబంధించిన డిస్ట్రిక్ యాప్ లో అందుబాటులోకి రావడం వల్ల కూడా ఈ విషయం గురించి చాలామందికి సరైన సమాచారం లేకపోవడం మైనస్ అయిందని తెలుస్తోంది.
ఇప్పుడు ఆ సమస్యలన్నీ పరిష్కారం కాగా ఆఫ్ లైన్ బుకింగ్స్ ఆధారంగా పుష్ప ది రూల్ కలెక్షన్లు డిసైడ్ కానున్నాయని చెప్పవచ్చు. పుష్ప ది రూల్ సినిమాకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. టాక్ ఏ మాత్రం అనుకూలంగా ఉన్నా బన్నీ బాక్సాఫీస్ కింగ్ అని మరోసారి ప్రూవ్ అవుతుందని చెప్పడంలో సందేహం అవసరం లేదు. పుష్ప ది రూల్ సినిమాకు టాప్ టెక్నీషియన్లు పని చేశారు.
ఈ సినిమాకు సంబంధించిన ప్రతి ఈవెంట్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. అయితే టికెట్ రేట్లు మరీ భారీగా ఉండటంపై కొంతమేర నెగిటివ్ కామెంట్లు వినిపిస్తున్నాయి. టికెట్ రేట్లతో అభిమానులను పిండేస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. పుష్ప2 టికెట్ రేట్లకు సంబంధించి కొన్ని స్క్రీన్ షాట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సామాన్యుల నుంచి టికెట్ రేట్ల విషయంలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. బన్నీ సినిమా ఇండస్ట్రీని షేక్ చేసే సినిమా కావాలని ఫ్యాన్స్ ఫీలవుతుండటం గమనార్హం.