ఓ థియేటర్ దగ్గర ఏర్పాటు చేసిన ఈ కటౌట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది .. అయితే ఈ ఫ్లెక్స్ లో ఎక్కడా కూడా మెగా ఫ్యామిలీకి చెందిన హీరోలు ఎక్కడ కనిపించారు.మెగా - అల్లు కుటుంబాల మధ్య గత కొంతకాలంగా విభేదాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే .. ఇక గత ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతుగా నిలిచారు .. వైసిపి అభ్యర్థి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డికి నంద్యాల వెళ్లి మరి తన మద్దతు ఇచ్చారు బన్నీ.. ఇక మెగా కుటుంబం అంతా కూడా పవన్ కళ్యాణ్ కు అండగా నిలిస్తే ఒక్క అల్లు అర్జున్ మాత్రం వైసిపి అభ్యర్థికి తన మద్దతు ఇవ్వటం .. బన్నీ సపోర్ట్ ఇచ్చిన శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఓడిపోవడంతో మెగా అభిమానులకు అల్లు అర్జున్ ను ఒక్కసారిగా టార్గెట్ అయ్యారు.
ఇక ఈ ఘటనతో మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్యూ ఫ్యామిలీ అన్నట్టుగా మొత్తం సీను మారిపోయింది. ఇక పుష్ప2 ప్రమోషన్స్లో అల్లు అర్జున్ కూడా ఎక్కడ మెగా ఫ్యామిలీ గురించి మాట్లాడలేదు .. ఇక గతంలో పలు ఈవెంట్లో మెగా అభిమానులు అంటూ మాట్లాడిన అల్లు అర్జున్ ఇప్పుడు మాత్రం మై ఫాన్స్ , మై ఆర్మీ అని మాత్రమే మాట్లాడుతూ వచ్చారు .. ఇక దీని కారణంగానే అల్లు అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో మెగా హీరోలకు చోటు ఇవ్వలేదని కూడా అంటున్నారు.